Narakasura: ఓటీటీలో రక్షిత్‌ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 11 Mar 2024 00:07 IST

హైదరాబాద్‌: రక్షిత్‌ అట్లూరి హీరోగా సెబాస్టియన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నరకాసుర’ (Narakasura ott release). అజ్జా శ్రీనివాస్‌ నిర్మాత. అపర్ణ జనార్దన్‌, సంకీర్తన విపిన్‌ కథానాయికలు. శతృ, నాజర్‌, చరణ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ‘నరకాసుర’ను అందుబాటులోకి తెచ్చారు. రూ.79 చెల్లించి ఈ మూవీని చూడొచ్చు. ఒకసారి సినిమా అద్దెకు తీసుకుని చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి.

ఇంతకీ కథేంటంటే: చిత్తూరు జిల్లాకు చెందిన శివ (రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టేట్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్ రాజ్)అంటే అతనికి ఎంతో అభిమానం. నాయుడి గెలుపు కోసం ప్రత్యర్థులను సైతం చంపేస్తాడు. ఈ క్రమంలో ఒక రోజు శివ కనిపించకుండా పోతాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు? అతన్ని బంధించిందెవరు? ఎమ్మెల్యే నాయుడు కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్)తో శివకు ఎందుకు వైరం ఏర్పడింది? తనను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్) కోసం శివ ఏం చేశాడు? అన్నది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని