
Naresh:ప్రత్యేకంగా రూపొందించిన కారవాన్.. కొనుగోలు చేసిన నరేశ్
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు సీనియర్ నటుడు నరేశ్. ఈ ఏడాదిలో తన చేతి నిండా సినిమాలున్నాయని ఇటీవల నరేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇంట్లో కంటే కారవాన్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడటం మంచిది కాదని భావించిన ఆయన ఇటీవల ప్రత్యేకంగా ఓ వ్యాన్ని కొనుగోలు చేశారు. తన అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నారు. ఏసీతో ఉన్న ఈ వ్యాన్‌లో బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యాన్ని ఆయన ముంబయి నుంచి తెప్పించుకున్నారు. దీనికోసం ఆయన భారీగానే ఖర్చు పెట్టారు.
‘‘నటీనటులకు కారవాన్లు మరో ఇల్లు లాంటివి. నా జీవితంలో 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటుంది. దాంతో కార్ల కోసం ఖర్చుపెట్టే బదులు.. మంచి కారవాన్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన కారవాన్‌లో ఉండటం కూడా అంత ఉత్తమం కాదు. నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను’’ అని నరేశ్ చెప్పుకొచ్చారు.