AlluArjun: బన్నీ గ్రాండ్‌ పార్టీ.. ప్లాన్‌ స్నేహారెడ్డిదే..!

‘పుష్ప’తో దేశవ్యాప్తంగా.. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్‌లో విజయకేతనం ఎగురవేశారు నటుడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవ...

Published : 22 Apr 2022 12:16 IST

పోస్ట్ చేసిన నటుడు

హైదరాబాద్‌: ‘పుష్ప’తో దేశవ్యాప్తంగా.. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్‌లో విజయకేతనం ఎగురవేశారు నటుడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన పుట్టినరోజు నాడు సన్నిహితులకు బన్నీ గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. విదేశాల్లో జరిగిన ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్‌ బన్నీ సతీమణి స్నేహారెడ్డిదేనట. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా నటుడు నవదీప్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ పెట్టారు. ‘‘40మంది బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో 40వ పుట్టినరోజు వేడుకలు.. అతి తక్కువ సమయంలోనే ఈ ట్రిప్‌ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎంజాయ్‌ చేశాం. స్నేహారెడ్డి.. టూర్‌ బాగా ప్లాన్‌ చేశారు. మరోసారి హ్యాపీ బర్త్‌డే బావ’’ అని పేర్కొంటూ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్‌ చేశారు. తన పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని ఏప్రిల్‌ 8న బన్నీ.. తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కోసం సెర్బియాలో స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. గ్రాండ్‌ లెవల్‌లో జరిగిన ఈ పార్టీ ఫొటోలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని