ఈసారి ఒక్క విషయం కూడా చెప్పను: చిరంజీవి

ఈమధ్య మెగాస్టార్‌ చిరంజీవి మైక్‌ పట్టుకుంటే చాలు రాబోయే సినిమా గురించి ఏదో ఒక లీక్‌ చేస్తారని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి అలాంటి ఛాన్స్‌ లేదంటూ మెగాస్టార్‌ అందరి ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఓ సినిమా ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరు వేదికపై మాట్లాడుతూ..

Published : 07 Feb 2021 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి మైక్‌ పట్టుకుంటే చాలు రాబోయే సినిమా గురించి ఏదో ఒకటి లీక్‌ చేస్తారని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి అలాంటి ఛాన్స్‌ లేదంటూ ఆయన అందరి ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఓ సినిమా ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరు వేదికపై మాట్లాడుతూ.. అనుకోకుండా ఓ ఆసక్తికరమైన వార్తను బహిర్గతం చేశారు. కొరటాల శివతో చేస్తున్న చిత్రం ‘ఆచార్య’ అంటూ సినిమా పేరు ప్రకటించేశారు. అది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఎప్పుడు మాట్లాడినా.. లీకుల కోసం ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయంపై సరదా పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. అయితే.. ఈ మధ్య సోషల్‌ మీడియాలోకి వచ్చిన చిరు ఇవన్నీ తెలుసుకున్నారో ఏమో..! లీకుల వ్యవహారంపై స్పందించారు.

మెగాస్టార్‌ మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక తాజాగా జరిగింది. ఆ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాలో విషయం మొత్తం ముందే లీక్‌ చేస్తానేమో.. అది నా బలహీనత. నాకు మైక్‌ ఇచ్చేముందు సినిమా వాళ్లందరిలో ఆ అనుమానం ఉండే ఉంటుంది. అయితే.. ఈసారి ఆ ఛాన్స్‌ లేదు. సినిమాలో విషయం ఒక్కటి కూడా అస్సలు బయట చెప్పను. ఈ సినిమా చూసిన వెంటనే ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి.. ‘సినిమా ఎంతో గొప్పగా ఉంది.. ఇలాంటి గొప్ప సినిమాలు మీరంతా చూడాలి’ అని చెప్పాలని తపనపడ్డాను. కానీ, నాకు నేనుగా కంట్రోల్‌ చేసుకోవాల్సి వచ్చింది’ అని మెగాస్టార్‌ అన్నారు. ఆ వెంటనే కార్యక్రమానికి వచ్చిన అభిమానులంతా ఈలలు వేస్తూ గోల చేశారు.

ఇవీ చదవండి..

అక్కడ సినిమా తీస్తే హిట్టే!

100 రోజులయ్యాకే నా సినిమా చూస్తా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు