Malaika Arora: ఐదుగురు హీరోయిన్స్‌ నో.. కానీ, మలైకా స్టార్‌ అయ్యింది

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘దిల్‌ సే’లో చల్‌ ఛయ్యా ఛయ్యా సాంగ్‌ చేసి పాపులారిటీ సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. అయితే, ఈపాట కోసం మొదట ఆమెను అనుకోలేదని డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ తెలిపారు.

Updated : 29 Jun 2023 16:27 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి, ఫిటెనెస్‌ స్టార్‌ మలైకా అరోరాకు (Malaika Arora) సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె స్నేహితురాలు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ బయటపెట్టారు. మలైకాకు స్టార్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిన ‘ఛయ్యా ఛయ్యా’ పాటకు మొదట వేరే హీరోయిన్స్‌ను అనుకున్నారని చెప్పారు. ‘మూవీంగ్‌ ఇన్‌ విత్‌ మలైకా’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘‘మలైకా.. నువ్వు ఎప్పటికీ ఛయ్యా ఛయ్యా అమ్మాయివే. నీ అదృష్టం బాగుంది. సుమారు ఐదుగురు నటీమణులు నిరాకరించడంతో ఆ పాట నిన్ను వరించింది. మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది’’ అని తెలిపారు.

‘‘మలైకాతో ఈ పాట చేయాలని మేము అస్సలు అనుకోలేదు. మా జాబితాలో ఆమె పేరు కూడా లేదు. మొదట మేము శిల్పాశెట్టి, తర్వాత శిల్పా శిరోద్కర్‌తోపాటు మరో ముగ్గురు హీరోయిన్స్‌ని కలిశాం. ఒక్కరేమో కదిలే ట్రైన్‌పై డ్యాన్స్‌ అంటే భయపడ్డారు. మరొకరు అందుబాటులో లేరు. అలాంటి సమయంలో నా మేకప్‌మేన్‌.. ‘మలైకా మంచి డ్యాన్సర్‌’ అని చెప్పాడు. అలా, ఆమెను ఈ పాటలో భాగం చేశాం. సాంగ్‌ షూట్‌ మొదలయ్యాక కూడా.. సరిగ్గా చేస్తుందా? లేదా? అని కంగారు పడ్డాం. కానీ, ఆమె డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది’’ అని ఫర్హా ఖాన్‌ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘మూవీంగ్‌ ఇన్‌ విత్‌ మలైకా’తో వ్యాఖ్యాతగా మలైకా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని