Sharan Kumar: కృష్ణ కుటుంబం నుంచి ఎనిమిదో నటుడు.. ఎవరంటే?

ప్రముఖ నటుడు కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా పరిచయం కాబోతున్నారు.

Published : 20 Sep 2022 04:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కృష్ణ (Krishna) కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆయనెవరో కాదు నరేశ్‌ అల్లుడు శరణ్‌ కుమార్‌ (Sharan Kumar). ఈయన హీరోగా ‘మిస్టర్‌ కింగ్‌’ (Mr King) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. శరణ్‌ గురించి తెలియని కొందరు సినీ అభిమానులు ‘ఈ హీరో ఎవరా?’ అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శరణ్‌ ఎవరో తెలిసేలా ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. అందులో కృష్ణ, నరేశ్‌, సుధీర్‌బాబు తమ ఫ్యామిలీ నుంచి రాబోతున్న శరణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు. ఇప్పటివరకూ కృష్ణ కుటుంబం నుంచి ఏడుగురు నటులు ప్రేక్షకులను అలరించగా.. తాజాగా ఎనిమిదో యాక్టర్‌గా శరణ్‌ వస్తున్నారు. తన తాత కృష్ణ నుంచి ఎంతో స్ఫూర్తిపొందానని శరణ్‌ తెలిపారు.

శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిస్టర్‌ కింగ్‌’లో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని