ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
ott movies: ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.
ఇటీవల థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన పలు చిత్రాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అలాగే కొన్ని వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి.
ఓటీటీలో ‘కస్టడీ’
నాగచైతన్య (Naga Chaitanya) కానిస్టేబుల్ పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘కస్టడీ’ (Custody). వెంకట్ ప్రభు తెరకెక్కించారు. కృతి శెట్టి (Kriti Shetty) కథానాయిక. తెలుగు - తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 9 నుంచి అందుబాటులో (Custody OTT Release) ఉండనుంది.
విడుదలైన 14 రోజుల్లోనే..
నరేశ్ అగస్త్య, వైవా హర్ష, బ్రహ్మాజీ, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘#మెన్‌టూ’ (#Mentoo). ‘బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ’ అనేది ఉపశీర్షిక. మే 26 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 9 నుంచి ఈ చిత్రం ఓటీటీ (ott) ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
అలరిస్తున్న 2018
జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. కేరళలో సంభవించిన వరదల ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళ, కన్నడ, తమిళభాషల్లో అందుబాటులో ఉంది.
అవతార్2 కూడా వచ్చేసింది!
యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన ‘అవతార్ 2’ (Avatar 2) ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ (james cameron) ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- బర్రకుడ క్వీన్స్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది
- ఆర్నాల్డ్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది
- నెవర్ హావ్ ఐ ఎవర్ (వెబ్‌సిరీస్) జూన్ 08
- టూర్ డి ఫ్రాన్స్(వెబ్‌సిరీస్) జూన్ 08
- బ్లడ్ హౌండ్స్ (కొరియన్ సిరీస్) జూన్ 09
అమెజాన్ ప్రైమ్
- మై ఫాల్ట్ (హాలీవుడ్) జూన్ 08
జీ5
- ది ఐడల్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది
డిస్నీ+హాట్‌స్టార్
- సెయింట్ ఎక్స్ (వెబ్‌సిరీస్) జూన్07
- ఎంపైర్ ఆఫ్ లైట్ (హాలీవుడ్) జూన్ 09
- ఫ్లామిన్ హాట్ (హాలీవుడ్) జూన్ 10
జియో సినిమా
- బ్లడీ డాడీ (హిందీ) జూన్ 09
- యూపీ 65 (హిందీ సిరీస్) జూన్ 08
యాపిల్ టీవీ ప్లస్
- ది క్రౌడెడ్ రూమ్ (వెబ్‌సిరీస్) జూన్ 08
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Dulquer Salmaan: భీమ్స్ బీట్స్ విన్న ప్రతిసారి డ్యాన్స్ చేస్తున్నా: దుల్కర్ సల్మాన్
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
OBC census: ఓబీసీ గణన చేపట్టాల్సిందే..: మల్లికార్జున ఖర్గే డిమాండ్