Parampara: ఆకట్టుకునేలా ‘పరంపర’ సీజన్‌ 2 టీజర్‌

గతేడాది నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటి ‘పరంపర’ (Parampara). ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+Hotstar) వేదికగా...

Published : 30 Jun 2022 15:48 IST

హైదరాబాద్‌: గతేడాది నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటి ‘పరంపర’ (Parampara). ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+Hotstar) వేదికగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడిదే వెబ్‌సిరీస్‌కు కొనసాగింపుగా ‘పరంపర సీజన్‌-2’ (Parampara Season2) సిద్ధమైంది. జులై 21న ప్రసారం కానున్న ఈ సిరీస్‌ టీజర్‌ గురువారం విడుదలైంది. ‘‘నా ఉద్దేశం నాయుడుని చంపడం కాదు సర్‌. వాడి అహాన్ని దెబ్బకొట్టాలి’’ అంటూ నవీన్‌చంద్ర (Naveen Chandra) చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. జగపతిబాబు, శరత్‌కుమార్‌, ఆకాంక్ష సింగ్‌.. తదితరులు సీరియస్‌ లుక్స్‌లో మెప్పించారు. ఆధిపత్యపోరు, కుటుంబ వారసత్వం.. వంటి సీరియస్‌ కాన్సెప్ట్‌తో పొలిటికల్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘పరంపర’ సిరీస్‌ రూపుదిద్దుకుంది. నవీన్‌చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. హరి యేలేటి కథ అందించగా.. కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ ఆరిగెళ్ల, హరి యేలేటి దర్శకత్వం వహించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లలో ‘పరంపర’ సీజన్‌-1 ప్రేక్షకుల్ని అలరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని