Vinaro Bhagyama Vishnu Katha: వినరో భాగ్యము విష్ణుకథ.. ఆ పిల్లవాడు పగ తీర్చుకుని ఉంటే..!
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన సరికొత్త చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఫిబ్రవరి విడుదలైన ఈసినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సినిమాపై తాజాగా పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు.
హైదరాబాద్: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyama Vishnu Katha). సెల్‌ఫోన్ నంబర్ నైబర్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) రివ్యూ చెప్పారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పిన ఆయన.. కథ, హీరో నటనను మెచ్చుకున్నారు.
‘‘వినరో భాగ్యము విష్ణుకథ’.. టైటిల్ గమ్మత్తుగా పెట్టారు. కథకు మకుటంలో మార్కులు వేయాలంటే దీనికి తప్పకుండా మార్కులు వేయాలి. ఎందుకంటే, ఈ కథ వింటే మనకు ఒక ఆనందం కలుగుతుందనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌ను టైటిల్‌తోనే దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు క్రియేట్ చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఇది విడుదలైంది. చిన్న నిర్మాతలకు ఆయన అండగా నిలుస్తుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కథ విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. సాధారణంగా టైటిల్ కార్డుల్లో అల్లు అరవింద్ పేరు చూశామంటే ఆ సినిమా అపజయం కావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సినిమా కథ విని.. అది ఆడుతుందా? లేదా? అని ఆయన కనిపెట్టగలరు.
ఇక, సినిమా విషయానికి వస్తే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి దర్శకుడు మురళీ, నటులు కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, నటి కశ్మీరా .. ఈ నలుగురు నాలుగు స్తంభాలు. ఇది రూ.11 కోట్లు కలెక్ట్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, ఇది లాభాలు తెచ్చిపెట్టిందా? లేదా? అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ.. సినిమాని చూస్తే మాత్రం 100 శాతం లాభాలు తెచ్చే సినిమాగానే ఉంది. ఇదొక మనసును హత్తుకునే చిత్రం.
ఫోన్ నంబర్ నైబర్ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. సెల్ ఫోన్లు ఉపయోగించే చాలామంది పిల్లలకు ఇదొక హెచ్చరిక. ఒక ఫోన్ కారణంగా వ్యక్తుల మధ్య ప్రేమ పెరిగింది. ఒక వ్యక్తి ప్రాణాలే పోయే స్థితికి చేరుకున్నాడు. మరొకరికి చీటింగ్ జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని దీనితో దర్శకుడు మరోసారి చెప్పాడు. మురళీ శర్మ పాత్ర చనిపోవడంతో ఇంటర్వెల్ ఇచ్చాడు. ఆ సీన్ అప్పుడు ఆడిటోరియం మొత్తం సినిమాలో లీనమైపోయి ఉంటుంది. హీరోయిన్ హత్యా నేరంపై ఇరుక్కుంటే హీరో ఆమెను ఎలా బయటకు తీసుకువచ్చాడు? అనేది మిగతా కథ.
ఒక చిన్నపిల్లాడి కళ్ల ముందే అతడి తల్లిదండ్రులు చనిపోవడం వంటి దయనీయమైన అంశంతో కథను మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ పిల్లాడు కనుక పగా ప్రతీకారాలతో ఉంటే సినిమా మరోలా ఉండేది. అలా కాకుండా ఆ పిల్లాడు మంచి గుణాలతో పెరగడానికి కారణం అతడి తాత (సుధాకర్). పెద్దవాళ్లు ఏం చెబితే మనం అదే నేర్చుకుంటాం అనే నీతిని ఈ కథతో మరోసారి తెలియజేశాడు. ఫోన్ నంబర్ నైబర్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌కు తన నటనతో ప్రాణం పోశాడు నటుడు కిరణ్ అబ్బవరం. ఆయన చాలా నేచురల్‌గా నటించాడు’’ అని పరుచూరి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్