Bandla Ganesh: దేవర.. మీకు తిరుగు లేదు: బండ్ల గణేశ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై విపరీతమైన అభిమానాన్ని కనబరుస్తుంటారు నటుడు, నిర్మాత బండ్లగణేశ్‌. అదే అభిమానంతో పవన్‌ని దేవర అని ప్రేమగా అభివర్ణిస్తుంటారాయన. తాజాగా పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు...

Published : 07 Apr 2022 11:59 IST

పవన్‌కల్యాణ్‌ని ఉద్దేశిస్తూ బండ్లన్న పోస్ట్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై విపరీతమైన అభిమానాన్ని కనబరుస్తుంటారు నటుడు, నిర్మాత బండ్లగణేశ్‌. అదే అభిమానంతో పవన్‌ని దేవర అని ప్రేమగా అభివర్ణిస్తుంటారాయన. తాజాగా పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు. ట్విటర్‌ వేదికగా.. ‘‘మీకు తిరుగులేదు దేవర’’ అని ట్వీట్‌ చేశారు. బండ్లగణేశ్‌ చేసిన ట్వీట్‌పై పవన్‌ అభిమానులు హ్యాపీగా రియాక్ట్‌ అవుతున్నారు.

రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్‌కల్యాణ్‌.. మరి కొన్నిరోజులపాటు తన తదుపరి సినిమా షూటింగ్స్‌పై దృష్టి సారించనున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్‌ 8 నుంచి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హరిహరవీరమల్లు’ సెట్‌లోకి పవన్‌ అడుగుపెట్టనున్నారు. చారిత్రక కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా పోరాట సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం పవన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సాధనలో పాల్గొన్నారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోడర్ లాజరోవ్‌తో కలిసి పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఆ ఫొటోలు చూసిన బండ్లగణేశ్‌.. ‘‘గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర’’ అని రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని