Kriti Kharbanda: ప్రియుడిని పెళ్లాడిన ‘తీన్‌మార్‌’ నటి

తన ప్రియుడు, నటుడు పులకిత్‌ సామ్రాట్‌ (Pulkit Samrat)ను వివాహం చేసుకున్నారు నటి కృతి కర్భందా (Kriti Kharbanda).

Published : 16 Mar 2024 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తీన్‌మార్‌’తో తెలుగువారికి చేరువైన నటి కృతి కర్భందా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు పులకిత్‌ సామ్రాట్‌తో ఆమె ఏడడుగులు వేశారు. శుక్రవారం గురుగ్రామ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. తమకు వివాహమైందని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌ చేశారు. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు చెబుతున్నారు.

న్యూదిల్లీకి చెందిన కృతి కర్భందా చిన్నప్పటినుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్కూల్‌ డేస్‌లోనే పలు వాణిజ్య ప్రకటన కోసం వర్క్‌ చేసిన ఆమె.. మోడలింగ్‌ అనంతరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులో వచ్చిన ‘బోణి’ ఆమె తొలి చిత్రం. ‘తీన్‌మార్‌’, ‘ఒంగోలు గిత్త’ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈక్రమంలోనే హిందీలోకి అడుగుపెట్టిన ఆమె.. నటుడు పులకిత్‌ సామ్రాట్‌ను ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో ఆరేళ్ల ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని