Raj and DK: ‘గన్స్‌ అండ్ గులాబ్స్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘గన్స్‌ అండ్ గులాబ్స్‌’ (Guns and Gulaabs) వెబ్‌ సిరీస్‌ విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది ప్రసారం కానున్నట్లు తెలిపారు.

Published : 21 Jul 2023 18:39 IST

హైదరాబాద్‌: ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ (The Family Man), ‘ఫర్జీ’ (Farzi) వెబ్‌ సిరీస్‌లతో హిట్స్‌ అందుకున్న దర్శకులు రాజ్‌ అండ్ డీకే (Raj and DK) మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వీళ్ల దర్శకత్వంలో రూపొందిన ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ను (Guns and Gulaabs) నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) వేదికగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. క్రైమ్‌ ఎంటర్‌ టైనర్‌గా రానున్న ఈ సిరీస్‌ ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించారు.

ఓటీటీలోకి ‘సామజవరగమన’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman), ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను గతేడాదిలో ప్రకటించారు. 90ల్లో జరిగిన ఓ వాస్తవ కథ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. ప్రేమ, అమాయకత్వాన్ని వర్ణించే క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది. ఇప్పటి వరకు రాజ్‌ అండ డీకే దర్శకత్వంలో వచ్చిన అన్నీ వెబ్‌ సిరీస్‌లు అమోజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారమయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌ను మొదటిసారి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇక రాజ్, డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సిటడెల్’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం దాని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.  ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్‌ మ్యాడెన్‌ (Richard Madden) నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌కు ఇండియన్‌ వెర్షన్‌గా తెరకెక్కిన ఇది మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని