Peddhanna Review: రివ్యూ: పెద్దన్న
Peddhanna: రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘పెద్దన్న’ మూవీ ఎలా ఉందంటే?
చిత్రం: పెద్దన్న; నటీనటులు: రజనీకాంత్, కీర్తిసురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ తదితరులు; ఛాయాగ్రహణం: వెట్రి, సంగీతం: ఇమ్మాన్, కూర్పు: రూబెన్, నిర్మాణం: కళానిధి మారన్, దర్శకత్వం: శివ; సంస్థ: సన్ పిక్చర్స్, విడుదల: డి.సురేష్‌బాబు, నారాయణ్‌దాస్ నారంగ్, దిల్‌రాజు; విడుదల తేదీ: 4-11-2021
దీపావళి సినిమాల్లో ప్రత్యేకమైన ఆసక్తిని పెంచిన చిత్రమంటే రజనీకాంత్(Rajinikanth) ‘పెద్దన్న’(Peddhanna)నే. మాస్ చిత్రాలకి పెట్టింది పేరైన దర్శకుడు శివ తెరకెక్కించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. తన అభిమానులైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడే రజనీకాంత్‌ని దర్శకుడు శివ ఎలా చూపించాడు?ఈ సినిమా(Peddhanna Review) ఎలా ఉంది?
కథేంటంటే: రాజోలు చుట్టు పక్కల గ్రామాలకు పంచాయతీ పెద్ద వీరన్న (రజనీకాంత్). ఆయనకి చెల్లెలు కనకమహాలక్ష్మి (కీర్తిసురేష్ Keerthy Suresh) అంటే ప్రాణం. ఆమె పిలిస్తే పలకడం కాదు, తలిస్తేనే పలికేంతగా ఉంటుంది ఇద్దరి మధ్య బంధం. చదువుకునేందుకు పట్నం వెళ్లి తిరిగొస్తుందంటే ఊళ్లోనే కాదు, ఆమె ఎక్కొచ్చిన రైలు బండికి కూడా పండగే. కనక మహాలక్ష్మికి చుట్టు పక్కలే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు వీరన్న. మొదట శత్రువుగా ఉండి, ఆ తర్వాత మిత్రుడైన ప్రకాశ్‌రాజ్ కొడుకుతో పెళ్లి నిశ్చయమవుతుంది. అన్న మాట జవదాటని చెల్లెలు ఆ పెళ్లికి అంగీకారం తెలుపుతుంది. తీరా పెళ్లి ముహూర్తానికి ముందు మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇంతకీ ఆమె ఎందుకు వెళ్లిపోయింది? వెళ్లాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన మాట కాదని వెళ్లిన చెల్లెలి గురించి వీరన్న పట్టించుకున్నాడా?లేదా?తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. బంధం, గ్రామీణ నేపథ్యం, ప్రతీకారం... తదితర అంశాల చుట్టూ కథని అల్లి, దానికి రజనీకాంత్(Rajinikanth) స్టైల్ మాస్ అంశాల్ని ఆయన హీరోయిజాన్ని జోడించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు శివ. స్వతహాగా రజనీకాంత్ (Rajinikanth) అభిమాని అయిన ఆయన, ఒకప్పుడు తాను చూసిన రజనీని తెరపై చూసుకోవాలనుకున్నారేమో. అలాంటి ఆహార్యంతోనే రజనీని హుషారుగా చూపించారు కానీ, ఈ కథని కూడా పాతకాలాన్ని అప్పటి సినిమాల్ని గుర్తు చేసేలా రాసుకోవడమే సినిమాకి మైనస్‌గా మారింది. రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో కానీ ఎలాంటి కొత్తదనం లేదు.
ప్రథమార్ధం సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. రజనీ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని కామెడీ సన్నివేశాలతో అభిమానులకి నచ్చేలాగే సన్నివేశాలు సాగుతాయి. మరదళ్లుగా ఖుష్బూ(Khushbu), మీనా(Meena) ఎంట్రీ ఇవ్వడం, బావతో కలిసి చేసే అల్లరి, అమాయకులైన వాళ్ల తమ్ముళ్లకి కనక మహాలక్ష్మిని ఇవ్వమని అడగడం తదితర సన్నివేశాలు ఇదివరకు చూసేసినట్టే అనిపించినా కాలక్షేపాన్ని మాత్రం ఇస్తాయి. కనక మహాలక్ష్మి పెళ్లికి ముందు వచ్చే మలుపే తదుపరి కథపై ఆసక్తిని పెంచుతాయి. ద్వితీయార్ధం కథ కలకత్తాకి మారుతుంది. అంతకుముందు కథలో వచ్చిన మలుపు వెనక కూడా బలమైన కారణం లేకపోవడంతో ద్వితీయార్ధం కూడా చప్పగానే మొదలవుతుంది. కలకత్తాలో తన చెల్లెలి కన్నీటికి కారణమైన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడం, చెల్లెలికి అడుగడుగునా రక్షణగా నిలవడమే మిగిలిన కథంతా. బలమైన ఇద్దరు ప్రతినాయకులు ఉద్ధవ్ పారేకర్ (జగపతిబాబు), మనోజ్ పారేకర్ (అభిమన్యు సింగ్) ఢీ కొట్టినా.. ఆ పాత్రలు సినిమా నిడివి పెంచడానికి ఉపయోగపడ్డాయే తప్ప అందులో ఎలాంటి బలం లేదు. జగపతిబాబు(Jagapathi babu) ఆహార్యం భయంకరంగా అనిపించినా చివర్లో ఆ పాత్రని ముగించే తీరు మరీ సాదాసీదాగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: రజనీకాంత్(Rajinikanth) వన్ మేన్ షో చేశారు. ఆయన స్టైల్, ఆయన మేనరిజమ్స్ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. పాటలు, పోరాట ఘట్టాల్ని హుషారుగా చేశారు. కీర్తిసురేష్(Keerthy Suresh) చెల్లెలి పాత్రలో పర్వాలేదనిపిస్తుంది. నయనతార(Nayanthara) అతిథి పాత్రని గుర్తు చేస్తుంది. రజనీకాంత్ పక్కన సహాయకుడిగా కనిపించే సూరి హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది. మీనా, ఖుష్బూ ప్రథమార్ధంలో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. రజనీ సినిమాలో విలన్లు అంటే భయపెట్టేలా ఉండాలి. కానీ ప్రకాష్‌రాజ్(Prakash Raj), అభిమన్యు సింగ్, జగపతిబాబు పాత్రలు పేలవంగా అనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇమ్మాన్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వెట్రి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు శివ కేవలం రజనీపైన, ఆయన స్టార్డమ్పైన ఆధారపడే ఈ కథని అల్లినట్టు అనిపిస్తుంది.
బలాలు
+ రజనీకాంత్
+ విరామ సన్నివేశాలు
+ అక్కడక్కడా కామెడీ
బలహీనతలు
- కథ.. కథనం
- ద్వితీయార్ధం
చివరిగా: ‘పెద్దన్న’... కొత్తగా ఏమీ లేదన్నా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం