‘అన్నాత్తే’కోసం హైదరాబాద్‌కు రజనీ

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో

Updated : 08 Apr 2021 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల అనంతరం రజనీకాంత్ ఈ చిత్ర షూటింగ్‌ కోసం తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెలలో చెన్నై శివార్లలో ఆ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్, రోబో శంకర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళని స్వామి సినిమాటోగ్రాఫర్‌. ఎడిటర్‌గా రూబెన్‌ వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 4న దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల రజనీకాంత్‌కి 2020కి గానూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును భారతప్రభుత్వం ప్రకటించింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు