Ram Charan: వీడియో కాల్‌లో రామ్ చరణ్‌ క్షమాపణలు.. ఎందుకంటే!

జర్మన్‌ యూనిటీ వేడుకలకు హాజరు కాలేకపోయినందుకు నటుడు రామ్‌ చరణ్ (Ram Charan)క్షమాపణలు చెప్పారు. వీడియో కాల్‌లో అందరినీ పలకరించారు.

Published : 23 Oct 2023 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్ఆర్‌’తో ఆ చిత్రబృందమంతా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పలు కార్యక్రమాలకు అతిథులుగా హాజరై వారంతా సందడి చేస్తున్నారు. తాజాగా జర్మన్‌ యూనిటీ డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఆ వేడుకలకు ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రబృందం తరపున కీరవాణి హాజరయ్యారు.

తాజాగా భారత్‌లో జర్మన్‌ యూనిటీ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి భారత్‌లోని జర్మనీ ఎంబసీకి చెందిన సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కీరవాణి హాజరు కాగా.. రామ్ చరణ్‌ (Ram Charan) వీడియో కాల్‌లో అందరినీ పలకరించారు. ఈ వేడుకలకు రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తాను వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఇటలీ వెళ్లాల్సి వచ్చిందని అందుకే రాలేకపోయినట్లు తెలిపారు. ఆ ఈవెంట్‌లో నాటునాటు పాటకు సంబంధించిన కటౌట్‌ను చూసి తనకెంతో ఆనందం వేసినట్లు చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు వారందరినీ కలుస్తానని మాటిచ్చారు.

సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌పై ప్రశ్న.. రణ్‌వీర్‌ ఏమన్నారంటే..!

ఇక ఈ కార్యక్రమంలో వేదికపై  కీరవాణి జర్మన్‌ లాంగ్వేజ్‌లో పాట పాడి అందర్నీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత జర్మన్‌ దౌత్యసిబ్బంది అందరూ కలిసి నాటునాటు పాటకు డ్యాన్స్‌ వేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జర్మన్‌ ఇండియా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ..‘‘నాటునాటు’ పాటకు ఆస్కార్‌ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆ పాటకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతుందని భావించానంతే. ఇక ఆ ఆస్కార్‌ భారతీయ సినిమాకు ఒక ప్రోత్సాహం. ఒక గొప్ప శకానికి నాంది అని భావిస్తున్నా’ అని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు