బాబూ రణ్‌వీర్‌.. ఏంటయ్యా ఇది!

సినిమా ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి సాధారణ నటుడి నుంచి అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగారు బీటౌన్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌. సినిమా, సినిమాకీ తనలోని నటుడ్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తూ కెరీర్‌ పరంగా...

Updated : 01 Jul 2021 13:41 IST

బీటౌన్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌పై నెటిజన్ల కామెంట్లు

ముంబయి: సినిమా ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి సాధారణ నటుడి నుంచి అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. సినిమా, సినిమాకీ తనలోని నటుడ్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు ఈ స్టార్‌. నటనలోనే కాకుండా స్టైల్‌లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతిసారీ కొంగొత్త లుక్స్‌తో రణ్‌వీర్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. బీటౌన్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పుకునే రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్‌ డిజైనర్‌ అలెశాండ్రో మిచెల్‌ను ప్రేరణగా తీసుకుని ఆయన మాదిరిగా దుస్తులు, హెయిర్‌స్టైల్‌తో రణ్‌వీర్‌ అందర్నీ ఒకింత అవాక్కయ్యేలా చేశారు. రణ్‌వీర్‌ షేర్‌ చేసిన ఫొటోలు చూసి కొంతమంది ఆశ్చర్యపోతే మరికొంతమంది మాత్రం.. ‘రణ్‌వీర్‌.. ఇవేం లుక్స్‌’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ట్రెండీ లుక్స్‌తో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు అందుకోవడం మన రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు..! అలాంటి కొన్ని లుక్స్‌ని మీరూ చూసేయండి..!












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని