అమ్మ మాట వల్లే నటుడినయ్యాను!

నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రావు రమేశ్‌. ‘గమ్యం’, ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తనదైన శైలిలో సంభాషణలు పలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Published : 02 Apr 2021 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రావు రమేశ్‌. ‘గమ్యం’, ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తనదైన శైలిలో సంభాషణలు పలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా తన మాతృమూర్తి వల్లే అని ఓ సందర్భంలో తెలియజేశారాయన. రావు రమేశ్‌కి దర్శకుడు కావాలనే లక్ష్యం ఉండేది. ఓసారి తన మనసులోని మాటను వాళ్లమ్మతో పంచుకున్నారు.

అప్పుడామె ఇలా బదులిచ్చారు.. ‘ఎవరిస్తారు నీకు దర్శకుడిగా అవకాశం. దర్శకుడు అవ్వాలంటే 24 విభాగాల గురించి తెలిసుండాలి. కింద ఉన్న టీ దుకాణంలో నలుగురు కలిసి ఏం మాట్లాడుకుంటారో నీకు తెలుసా?అసలు ఎప్పుడైనా గమనించావా? దర్శకుడు కావాలంటే ముందు జీవితం తెలియాలి. లెన్సులు తెలియడం డైరెక్షన్‌ కాదు జీవితం తెలియడం డైరెక్షన్‌. దర్శకత్వమంటే చాలా కష్టంతో కూడుకున్నది. నటన తేలికైంది. ముందు నటుడిగా నిరూపించుకుని, ఎవరైనా నిర్మాత నిన్ను నమ్మి డబ్బులు పెడితే అప్పుడు డైరెక్ట్‌ చేయ్‌’ అని అన్నారు. అలా దర్శకుడు కావాల్సిన రావు రమేశ్‌ నటుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని