Rashmika: గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చా: రష్మిక

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తనకు మంచి స్నేహితుడని మరోసారి స్పష్టం చేశారు నటి రష్మిక (Rashmika). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన విమర్శలపై స్పందించారు.

Published : 19 Jan 2023 13:39 IST

హైదరాబాద్‌: ఆరేళ్ల కెరీర్‌లో సుమారు 17 చిత్రాల్లో నటించి నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. కెరీర్‌లో ఎదురైన విమర్శలపై స్పందించారు. ఈ రంగంలో విమర్శలు సహజమని అభిప్రాయపడిన ఆమె.. అవి మితిమీరినప్పుడు తప్పక పెదవి విప్పాలన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ట్రోల్స్‌పై (Social Media Trolling) స్పందిస్తున్నానని చెప్పారు. చిన్నప్పుడు స్కూల్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.

‘‘ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. అదెలా సాధ్యం?’ అని ఇటీవల చాలా మంది నన్ను అడిగారు. చిరునవ్వుతో జీవించడాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాను. స్కూల్‌లో చదువుకునేటప్పుడు కుటుంబానికి దూరంగా హాస్టల్‌లో ఉండేదాన్ని. సుమారు 800 మంది విద్యార్థులు అక్కడ ఉండేవారు. ఎవరూ నాతో సరిగ్గా ఉండేవారు కాదు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తక్కువగా ఉండటంతో ఎన్నో అపార్థాలు తలెత్తాయి. నేను చేయని తప్పులకు మాటలు పడేదాన్ని. ఆ సమయంలో ప్రతిరోజూ గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా అమ్మతో పంచుకోవడం నాకు అలవాటు. ఆమే నన్ను ఇంత స్ట్రాంగ్‌గా చేసింది. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయని కాబట్టి దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటా’’ అని రష్మిక వివరించారు.

అనంతరం ఆమె ఇటీవల కిచ్చా సుదీప్‌ (Sudeep) ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి స్పందిస్తూ.. ‘‘నాకెంతో ఇష్టమైన ఓ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూని కొన్నిరోజుల క్రితం చూశాను. ఈ రంగంలో ఉన్నప్పుడు పూలదండలే కాదు. రాళ్లు, కోడిగుడ్లు విసిరినా తట్టుకోవాలని ఆయన అన్నారు. నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే, ఎదుటి వ్యక్తులు విసిరే రాళ్లు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, ఆ దెబ్బలకు మీకు రక్తం చిందినప్పుడు ఎదురు తిరగక తప్పదు కదా’’ అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై స్పందిస్తూ.. ‘‘విజయ్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇటీవల న్యూ ఇయర్‌ రోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు వెనుక విజయ్‌ వాయిస్‌ వినిపిస్తోందని కామెంట్స్‌ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మరో నలుగురి వాయిస్‌లు కూడా వినిపించాయి . వాటిని ఎవరూ పట్టించుకోలేదు. మేమిద్దరం కలిసి టూర్స్‌కు వెళ్లలేదని, పార్టీలు చేసుకోలేదని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఫ్రెండ్స్‌ అన్నాక కలిసి టూర్స్‌కు వెళ్లడం సహజం’’ అని చెప్పారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు