Rashmika: రష్మిక కొత్త ప్రయాణం.. ఆ విషయంలో ఫస్ట్ ఇండియన్‌గా
తాను ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టు ప్రముఖ హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో కుర్రకారు హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, నేషనల్ క్రష్‌గా మారిన హీరోయిన్.. రష్మిక (Rashmika Mandanna). నటిగా కన్నడ చిత్ర పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టిన ఆమె తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాను ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. జపాన్‌కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ సంస్థకు ‘బ్రాండ్ అడ్వకేట్’గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్ భారతీయురాలు తానేనని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన ‘మిలాన్ ఫ్యాషన్ వీక్’లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక.. ఒనిట్సుకా టైగర్ బ్రాండెడ్ దుస్తులు, బూట్లు ధరించి ఆ ఈవెంట్‌లో సందడి చేశానన్నారు.
బ్రాండ్ అడ్వకేట్లు.. అంబాసిడర్‌ల మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. అంబాసిడర్లను బ్రాండ్ అధికారికంగా గుర్తిస్తుంది. అడ్వకేట్లను గుర్తించదు. ఆయా బ్రాండ్‌లను వ్యక్తిగతంగా ఇష్టపడేవారెవరైనా అడ్వకేట్‌గా ఉండొచ్చు. ‘కిరాక్ పార్టీ’తో 2016లో నటిగా మొదలైన రష్మిక ప్రస్థానంలో ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప: ది రైజ్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఆమె.. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ ‘(Animal), అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
GT vs CSK: గుజరాత్ vs చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులు నమోదయ్యేనా..?
-
Crime News
Hyderabad: సినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ..
-
Movies News
Rajendra prasad: కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం: నటుడు రాజేంద్రప్రసాద్
-
Ap-top-news News
Bopparaju: ఉద్యోగ సంఘాల్లో చీలికలు తెచ్చి ఉద్యమాన్ని ఆపలేరు: బొప్పరాజు
-
Ts-top-news News
Raavi Narayana Reddy: పాత పార్లమెంటులో తొలి అడుగు తెలుగు ఎంపీదే
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు