Animal: ఆ సీన్‌ కోసం ఎంతో కష్టపడ్డా.. ‘యానిమల్‌’ ట్రోల్స్‌పై రష్మిక స్పందన

‘యానిమల్‌’లో తన నటనపై వచ్చిన ట్రోల్స్‌నుద్దేశించి రష్మిక మాట్లాడారు. ఎంతో కష్టపడి నటించినట్లు తెలిపారు.

Updated : 05 Apr 2024 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - రష్మిక (Rashmika) జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. విభిన్న కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అందుకుంది. అలాగే ట్రోల్స్‌కూ గురైంది. ముఖ్యంగా కర్వాచౌత్‌ సన్నివేశంలో రష్మిక ఓచోట డైలాగ్‌ సరిగా చెప్పలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

‘ఆడవాళ్ల శరీరాకృతిపై ట్రోల్స్‌ చేసే వాళ్లంటే నాకు అసహ్యం. యానిమల్‌లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ డెలివరీ బాలేదని విమర్శించారు. అందులోని కర్వాచౌత్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌. ఆ సన్నివేశంలో నేనెంతో కష్టపడి నటించాను. ఆ ఒక్క సీన్‌లోనే ఎన్నో రకాల ఎమోషన్స్‌ పలికించాలి. అందులో నా నటన చూసి సెట్‌ అంతా చప్పట్లతో మారుమోగింది. థియేటర్‌లోనూ అంతే రెస్పాన్స్‌ వచ్చింది. విచిత్రమేమిటంటే.. ఎంతోమందికి నచ్చిన ఆ సీన్‌పై కొందరు విమర్శలు కురిపించారు. 9 నిమిషాల సీన్‌లో 10 సెకండ్ల డైలాగ్‌ బాలేదని నన్ను ట్రోల్స్ చేశారు. వాటిని పట్టించుకోను. ఎందుకంటే నేను గిరిగీసుకొని ఉండాలనుకోవడం లేదు. ఎవరి అభిరుచి వాళ్లది. అందరికీ అన్నీ నచ్చాలని నిబంధన లేదు కదా’ అంటూ బదులిచ్చారు.

ఇక గతంలో ఇదే సన్నివేశంపై దర్శకుడు సందీప్‌ వంగా కూడా మాట్లాడారు. ‘‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా హావభావాలు పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం.. ఇలాంటివన్నీ చేయాలి’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని