Rathika Rose: అతడి వల్ల నేను బలైపోయా.. హౌస్‌మేట్స్‌ గురించి రతిక చెప్పిన నిప్పులాంటి నిజాలు!

Rathika Rose interview: బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రతికరోజ్‌ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Updated : 02 Oct 2023 21:15 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌(Bigg boss)లో తాను ఎవరిని నామినేట్‌ చేసినా, సరదాగా ఉన్నా అంతా గేమ్‌పరంగానేనని, వ్యక్తిగతంగా ఎవరికీ దగ్గర కాలేదని రతిక రోజ్‌ చెప్పుకొచ్చింది. నాలుగో వారం ‘బిగ్‌బాస్‌ సీజన్‌7’ నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రతిక (Rathika Rose) షేర్‌ చేసుకుంది.

మా ఇద్దరి మనసులో ఏమీ లేదు!

‘‘బిగ్‌బాస్‌’ నుంచి ఎలిమినేషన్‌ అంటే షాకింగ్‌గా ఉంది. అసలు ఏమీ అర్థం కావటం లేదు. నన్ను ఎలా చూపించారో కూడా తెలియదు. హౌస్‌లో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నా. గేమ్‌పరంగా ఎవరికి సపోర్ట్‌ చేయాలో వాళ్లకే చేశాను. ప్రశాంత్‌, నేనూ అంత క్లోజ్‌గా ఏమీ లేము. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లగానే ‘లేడీ లక్‌’ అంటూ నాపేరు చెప్పారు. ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. అప్పుడు ప్రశాంత్‌ నా దగ్గరే కూర్చొన్నాడు. మా మధ్య జరిగిన సరదా సంభాషణ కాస్త పరిధులు దాటింది. కానీ, ఆ సమయంలోనే అతడికి నేను వార్నింగ్‌ ఇచ్చా. ఆ విషయం బయట వాళ్లకు తెలియదు. తనని పల్లవ్‌ అని పిలవమని ప్రశాంత్‌ స్వయంగా కోరాడు. నేను వేరేవాళ్లతో మాట్లాడటం చూసి తను తట్టుకోలేకపోతున్నట్లు ప్రవర్తించేవాడు. మా ఇద్దరి మనసులో ఏమీ లేదు. ఒక రోజు నేను భోజనం చేస్తుంటే ‘నన్ను వదిలేసి తింటావా’ అని ప్రశాంత్‌ అడిగాడు. దీంతో అన్నం తీసుకుని వెళ్లి అతడి చేతిలో పెట్టా. ‘నీ చేతితో తినిపించవచ్చు కదా. అందుకు కూడా నేను పనికి రానా’ అని అన్నాడు. నేను తినిపించనని చెప్పాను. కానీ, నేను చపాతీ తింటుంటే లాక్కుని తనే తిన్నాడు’’

ప్రశాంత్‌పై నాకు ఎలాంటి ఫీలింగ్‌ లేదు

‘‘నాతో స్క్రీన్‌ స్పేస్‌ కోసం ప్రయత్నిస్తున్నాడేమోనని అతనితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడా. అప్పుడు అతడికి రెండు ముఖాలున్నాయిని అర్థమైంది. బిగ్‌బాస్‌ హౌస్‌ అందరితో మాట్లాడినట్టే అతడితోనూ సరదాగా మాట్లాడా. బయట అయితే అస్సలు మాట్లాడను. హౌస్‌లోకి రాకముందు తనెవరో కూడా తెలియదు. ప్రశాంత్‌పై నాకు ఎలాంటి ఫీలింగ్‌ లేదు. సరదాగా మాత్రమే ఉన్నా. గేమ్‌పరంగా యావర్‌ను అనర్హుడని చెప్పా.  ఒకరోజు యావరే స్వయంగా వచ్చి ‘ఐ లైక్‌ యూ రతిక’ అని చెప్పాడు. ఆ సమయంలో ‘ఐ లైక్‌ యు టు’ అని చెప్పకుండా ఉండాల్సింది. నామినేషన్స్‌ సమయంలో వాళ్ల టాపిక్స్‌ తీసుకొచ్చి నేను ఎలాంటి లబ్ది పొందలేదు’’

సేఫ్‌ గేమ్‌ ఆడలేదు!

‘‘తేజ విషయంలో కంటెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నించా. హౌస్‌లో సరదాగా ఏం చేసినా అవి సీరియస్‌ అవుతున్నాయి. తేజ, శోభల మధ్య ఒక అవగాహన ఉంది. బిగ్‌బాస్‌ హౌస్‌ అంటే అందరితోనూ కలిసి ఉండాలి. కొన్ని సందర్భాల్లో నా వ్యవహారశైలి వల్ల బ్యాడ్‌ అయ్యానేమో. సేఫ్‌గేమ్‌ ఎప్పుడూ ఆడలేదు. హౌస్‌లో అందరితో మంచిగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలా చేస్తే, నామినేషన్స్‌లో ఉండేదాన్నే కాదు. అక్కడ మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ ఎప్పుడూ చెప్పలేదు. బయట ఎలా ఉన్నానో హౌస్‌లో కూడా అలాగే ఉన్నాను’’

  • హౌస్‌మేట్స్‌ గురించి రతిక చెప్పిన నిప్పులాంటి నిజాలివే!
  • గౌతమ్‌: గేమ్‌ ఆడేటప్పుడు అవసరం లేకపోయిన షో చేయడానికి షర్ట్‌ తీసేస్తాడు.
  • ప్రియాంక: శోభ, ప్రియాంక, అమర్‌దీప్‌ కలిసి ఆడుతున్నట్లు అనిపించింది.
  • సందీప్‌ మాస్టర్‌: సందీప్‌కు వ్యతిరేకంగా పాయింట్ ఉంటే, మాట్లాడరు. సంచాలక్‌గా ఆయన డిజాస్టర్‌
  • అమర్‌దీప్‌: కంటెంట్‌ కోసం అతి చేయొద్దని ఇతరులకు సలహాలు ఇస్తాడు.
  • శోభాశెట్టి: సెంటిమెంటల్‌గా మాట్లాడితే కరిగిపోతుంది. నిజానిజాలు తెలుసుకోదు.
  • తేజ: జనాలను దృష్టిలో బ్యాడ్‌ అవకుండా ఎలా ఆడాలో తెలుసుకుని వచ్చాడు.
  • పల్లవి ప్రశాంత్‌: పల్లెటూరి నుంచి వచ్చిన సగటు యువకుడు కదా స్నేహంగా ఉండవచ్చని అనుకున్నా. కానీ, రెండో వారం నుంచే అతనిలోని షేడ్స్‌ చూపించటం మొదలు పెట్టాడు. అపరిచితుడులా ప్రవర్తించాడు. ‘నీ హార్ట్‌ ఎవరికి ఇస్తావు’ అని మా మధ్య సంభాషణ జరిగినప్పుడు సరదాగా అన్నానని అప్పుడు చెప్పాలింది. నాతోనూ వ్యక్తిగతంగా గేమ్‌ ఆడటం వల్ల నేను బలైపోయానేమో అనిపిస్తోంది.
  • శుభశ్రీ: ఏది చెప్పినా నమ్మేస్తుంది
  • ప్రిన్స్‌ యావర్‌: ప్రశాంత్‌ను ఫాలో అయ్యాడు.
  • శివాజీ: బయట బాగా ప్రిపేర్‌ అయి వచ్చాడేమో అనిపిస్తుంది. జనాలకు తానొక లీడర్‌గా కనిపించాలని అనుకుంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని