RRR: లాస్‌ ఏంజిల్స్‌ థియేటర్‌లో ‘నాటు నాటు’కు రచ్చ రచ్చ..!

‘బియాండ్‌ ఫెస్ట్‌’లో భాగంగా లాస్‌ ఏంజిల్స్‌లోని చైనీస్‌ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ప్రదర్శించారు. రాజమౌళి కూడా స్వయంగా హాజరై అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.

Published : 02 Oct 2022 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. భారత్‌లో పాటు, ఇతర దేశాల్లోనూ ఈ సినిమాకు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘బియాండ్‌ ఫెస్ట్‌’లో భాగంగా లాస్‌ ఏంజిల్స్‌లోని చైనీస్‌ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ప్రదర్శించారు. రాజమౌళి కూడా స్వయంగా హాజరై అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ షోకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తూ కనిపించారు. ఇక ‘నాటు నాటు’ పాట తెరపై కనిపించగానే పలువురు ప్రేక్షకులు వేదికపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్‌, చరణ్‌లతో కలిసి అభిమానులు సైతం ‘నాటు’ స్టెప్‌లు వేస్తూ సందడి చేశారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1200కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఆస్కార్‌ బరిలో నిలుస్తుందని ఆశించినా, అ అవకాశం రాలేదు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘ఛెల్లో’ మూవీని భారత్‌ నుంచి ఆస్కార్‌ స్క్రీనింగ్‌కు పంపిన సంగతి తెలిసిందే.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని