RRR: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ క్రియేటివిటీ!
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంపై గతంలోనూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన కొన్ని మీమ్స్ చూసేయండి.
ఇంటర్నెట్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు లేని ప్రయాణం ప్రాణానికి ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరి నిర్లక్ష్యం కారణంగా పలువురు ఆస్పత్రి పాలవుతుండగా, ఇంకొందరు ప్రాణాలనే కోల్పోతున్నారు. ఈ విషయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా అనేక మీమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్’. తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. బైక్‌పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి వెళ్తున్న పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. కాగా, ఆ ఫొటోతోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించాలని సంకల్పించారు. ఇంకేముంది వారి సోషల్ మీడియా విభాగం తాజా పోస్టర్‌లోని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హెల్మెట్ జోడించి, ‘ఇప్పుడు సరిగ్గా ఉంది. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ‘ఆర్ఆర్‌ఆర్’ టీమ్ కూడా స్పందించింది. ‘ఇప్పటికీ పర్‌ఫెక్ట్‌గా లేదు. నంబర్ ప్లేట్ మిస్సయింది’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇదే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంపై గతంలోనూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన కొన్ని మీమ్స్ చూసేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే..!
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!