Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?

‘కాంతార 2’ హీరోయిన్‌పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

Published : 19 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది ‘కాంతార’ (Kantara). స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన చిత్రమిది. దాని ప్రీక్వెల్‌ ‘కాంతార 2’ (Kantara 2) పనుల్లో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. ఇంకా పట్టాలెక్కని ఈ మూవీకి సంబంధించి ఓ రూమర్‌ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..? ఇందులోని హీరోయిన్‌ పాత్రకు రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) సెట్‌ అవుతుందని భావించిందట చిత్ర బృందం. ఈ మేరకు ఇప్పటికే స్క్రీన్‌టెస్ట్‌ కూడా చేశారని, ఆమె దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. మరోవైపు, ఈ ప్రాజెక్టులో తాను భాగమైనట్లు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. రిషబ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ‘కాంతార 2 లోడింగ్‌’ అని పేర్కొంది. మరి, వీరిద్దరూ హీరోయిన్లుగా నటిస్తారా? ఊర్వశి స్థానంలో రుక్మిణిని తీసుకుంటున్నారా? అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

‘కాంతార’లో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించి, అలరించింది. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ‘కాంతార 2’లో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రిషబ్‌ గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. రుక్మిణీ వసంత్‌ విషయానికొస్తే.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఏ’, ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బీ’ డబ్బింగ్‌ చిత్రాలతో ఆకట్టుకుంది. రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు అనుదీప్‌ కె.వి. తెరకెక్కించనున్న సినిమాలో ఈ బ్యూటీనే కథానాయికగా నటించే అవకాశాలున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని