Bro:‘బ్రో’ సినిమా విడుదల.. పవన్‌పై సాయి ధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌ నోట్‌

‘బ్రో’ (Bro) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌తేజ్‌ ఎమోషనల్‌ నోట్‌ రాశారు.

Updated : 28 Jul 2023 11:06 IST

హైదరాబాద్‌:  ‘బ్రో’(Bro) సినిమా నేడు విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సాయి ధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) తన మామయ్య పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఓ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్‌ చేశారు. అలాగే పవన్‌ కల్యాణ్‌తో ఉన్న తన చిన్నప్పటి ఫొటోను పంచుకుని ‘‘అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి!’’ అని క్యాప్షన్‌ రాశారు.

ఈరోజు తన కల నిజమైందని చెప్పిన సాయి ధరమ్‌తేజ్‌ దీనిని తన జీవితంలో మర్చిపోనని అన్నారు. ‘‘ప్రస్తుతం నాలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, మామయ్య, నా స్ఫూర్తి.. పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ పంచుకునే అదృష్టం దక్కింది. నేను ఇప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్నపిల్లాడినే. నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన తివిక్రమ్‌కు ధన్యవాదాలు. మీ వల్లే నా కల నిజమైంది. అలాగే సముద్ర ఖని, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, ‘బ్రో’ చిత్రబృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు. అన్నిటికంటే ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యలకు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌) వారి అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా మనందరిదీ. దీని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

‘బ్రో’ సినిమాకు వెళ్తున్నారా? ‘వినోదయసిత్తం’ గురించి ఇవి మీకు తెలుసా?

పవన్‌ కల్యాణ్, సాయి ధరమ్‌తేజ్‌లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro Movie). సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.  తమిళంలో సముద్రఖని రూపొందించిన ‘వినోదయసిత్తం’ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని