Satya: సాయిధరమ్ తేజ్‌ ‘సత్య’.. మరో రికార్డు

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’. తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

Published : 16 Feb 2024 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులు సొంతం చేసుకున్న ‘సత్య’ (Satya).. మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. టౌలౌజ్‌ షార్ట్స్‌ ఫెస్ట్‌ (ఫ్రాన్స్‌)లో 8 అవార్డులు అందుకుంది (Toulouse Shorts Fest- France). బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌, బెస్ట్‌ సౌండ్ డిజైన్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ ప్రొడ్యూసర్, బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌, బెస్ట్‌ ఇండీ షార్ట్‌ విభాగాల్లో పురస్కారాలు వరించాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తంచేసింది. ఈ పోస్ట్‌పై సాయిధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ.. మంచి సినిమా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుందన్నారు.  

ఈ మ్యూజికల్ షార్ట్‌ ఫిల్మ్‌లో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), స్వాతి (Swathi Reddy) ప్రధాన పాత్రల్లో నటించారు. నవీన్‌ విజయ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ పేరుతో గతేడాది ఆగస్టు 15న విడుదల చేసిన సాంగ్‌ మంచి ఆదరణ పొందింది.  ఈ షార్ట్‌ను న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేదికలో ప్రదర్శించగా.. రెండు అవార్డులు గెలిచింది. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాలతో అలరించిన సాయి తేజ్‌ ప్రస్తుతం ‘గాంజా శంకర్‌’తో బిజీగా ఉన్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని