SaifAlikhan: అప్పుడు ప్ర‌మాదానికి గురై 100కిపైగా కుట్లు

పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టే న‌టుల్లో సైఫ్ అలీఖాన్ ఒక‌రు. ఆ వ్య‌క్తిత్వం వ‌ల్ల ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ప్ర‌మాదానికి గురయ్యార‌నే సంగతి చాలామందికి తెలీదు.

Updated : 07 Dec 2022 21:59 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టే న‌టుల్లో సైఫ్ అలీఖాన్ ఒక‌రు. ఆ వ్య‌క్తిత్వం వ‌ల్ల ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఆయ‌న‌ ప్ర‌మాదానికి గురయ్యార‌నే సంగతి చాలామందికి తెలీదు. అదే సినిమా? ఆ ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..  కుంద‌న్ షా ద‌ర్శ‌క‌త్వంలో 2000లో తెర‌కెక్కిన చిత్రం ‘క్యా కహ్నా’. సైఫ్ అలీఖాన్, ప్రీతి జింటా జంట‌గా న‌టించారు. ఈ సినిమాలో సైఫ్.. బైక్‌తో కొండ‌పై జంప్ చేసే సన్నివేశం ఉంటుంది. దాని కోసం ప్ర‌తి రోజూ రిహార్స‌ల్ చేశారు సైఫ్‌. కొన్ని రోజుల త‌ర్వాత‌ చిత్రీక‌ర‌ణకి ఖండాలా వెళ్లారు. చిత్ర బృందం అక్క‌డికి వెళ్లిన స‌మ‌యంలో వ‌ర్షం ప‌డ‌టంతో సాధార‌ణంగా ఉన్న‌ నేలంతా బుర‌ద‌గా మారింది. ద‌ర్శ‌కుడు స్టార్ట్ చెప్పిన త‌ర్వాత పాత్ర‌లో ప‌ర‌కాయం ప్ర‌వేశం చేసి ఓకే అనిపించారు. కానీ, సైఫ్‌కి ఇంకా బాగా చేద్దాం అనే ఆలోచ‌న రావ‌డంతో మ‌రో టేక్ తీసుకున్నారు. రెండో ప్ర‌య‌త్నంలో బైక్ ప‌ట్టుత‌ప్పి ఓ రాయికి త‌గిలింది. ఈ ప్ర‌మాదంలో సైఫ్ త‌ల‌కి తీవ్ర‌గాయ‌మైంది. 100పైగానే కుట్లు ప‌డ్డాయి.

ఆసుప‌త్రిలో ప్రీతి మాత్ర‌మే..

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే సైఫ్‌ని ఓ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు ప్రీతి, ద‌ర్శకుడు. ఆ స‌మ‌యంలో సైఫ్ భార్య వేరే ప్రాంతంలో ఉన్నారు. సైఫ్ స్నేహితుడికి ఫోన్‌ చేసి చెప్తే అత‌ను జోక్ చేస్తున్నారనుకున్నాడు. కాస్త అనారోగ్యంతో ఉండ‌టంతో ద‌ర్శకుడు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దాంతో ప్రీతి ఒక్క‌రే సైఫ్ ప‌క్క‌న ఉన్నారు. మెడిక‌ల్ ఫామ్‌పై త‌నే సంత‌కం చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని