Salaar: ‘సలార్‌’లో యశ్‌.. క్లారిటీ ఇచ్చిన సింగర్‌..

‘సలార్‌’ (Salaar)లో యశ్‌ ఉన్నాడని గాయని తీర్థ సుభాష్‌ ఇటీవల చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై ఆ చిన్నారి క్లారిటీ ఇచ్చింది.

Published : 13 Dec 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’ (Salaar) విడుదల తేదీ దగ్గరపడడంతో దానికి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అది వైరల్‌ అవుతోంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్‌ ఉన్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘సలార్‌’లో నటించిన గాయని తీర్థ సుభాష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్‌’లో ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్‌, యశ్ (Yash) కూడా ఉన్నట్లు చెప్పింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ఆ వీడియోపై తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది. ‘‘కేజీఎఫ్‌’ సినిమాను నేను చాలా సార్లు చూశాను. అందులో యశ్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో మ్యూజిక్‌ గురించి మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. దాంతో ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ‘కేజీఎఫ్‌’ గుర్తొచ్చి యశ్‌ పేరు కూడా చెప్పానంతే.’’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఇక గతంలో ‘సలార్‌’.. ‘కేజీఎఫ్‌’ యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ స్పందిసూ రెండిటికీ సంబంధం ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రెండూ వేర్వేరు కథలనీ ఆయన చెప్పారు.

ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది..: త్రిప్తి డిమ్రీ

ఇక ఈ సినిమా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) మొదటి చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్‌ అంటూ వస్తోన్న వార్తలపై  కూడా తాజాగా ‘సలార్‌’ నిర్మాత స్పందించారు. ఇది ఏ సినిమాకు రీమేక్‌ కాదని స్పష్టం చేశారు. శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఇందులోని మొదటి సింగిల్‌ను డిసెంబర్‌ 14న విడుదల చేయనున్నారు. ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోన్న ఈచిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు