Chiranjeevi: పక్కా.. ఆడియన్స్‌కి ఫుల్‌ కిక్కే: చిరంజీవి

అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌రాజా దర్శకుడు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది...

Updated : 16 Mar 2022 12:30 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌రాజా దర్శకుడు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా లేటస్ట్‌ షెడ్యూల్‌ ముంబయిలో ప్రారంభమైంది. ఇందులో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. కాగా, పొలిటికల్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సల్మాన్‌ఖాన్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్‌లోకి అడుగుపెట్టారు.

చిరంజీవితో కాసేపు సరదాగా ముచ్చటించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని చిరు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘గాడ్‌ ఫాదర్‌ టీమ్‌లోకి సల్మాన్‌ భాయ్‌కి స్వాగతం..!! మీ రాక మా అందరిలో మరింత ఉత్సహాన్ని నింపింది. మీతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. స్క్రీన్‌పై మీరు కనిపించే ప్రతిసారీ ప్రేక్షకులు తప్పకుండా మ్యాజికల్‌ కిక్‌ ఫీలవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని చిరు తెలిపారు. ఈ సినిమాలో నయనతార.. చిరు సోదరి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్‌ సైతం కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని