Samantha: ఇలా జీవితాన్ని బెటర్‌ చేసుకోవచ్చు: కొత్త ప్రయాణంపై సమంత

తన కొత్త ప్రయాణంపై సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 15 Feb 2024 19:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నటిగానే కాదు వ్యక్తిగాను ఎందరికో స్ఫూర్తి ప్రముఖ నటి సమంత (Samantha). 2022లో ఆమె మయోసైటిస్‌ వ్యాధి బారినపడిన సంగతి తెలిసిందే. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు ‘యశోద’ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పి వృత్తిపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చి, మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం విదేశాలకూ వెళ్లారు. ప్రస్తుతం దానినుంచి కోలుకుంటున్నారు. మళ్లీ యాక్టింగ్‌పై దృష్టి పెడుతున్నారు. ‘ఏదో వ్యాధి వచ్చింది. చికిత్స తీసుకున్నాం’ అని అనుకోకుండా తన అనుభవాలను అందరితో పంచుకుని అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. పాడ్‌కాస్ట్‌ ద్వారా ఆ సంగతులు పంచుకోనున్నారు. ఆ వీడియో పాడ్‌కాస్ట్ (Samantha Podcast) ఫిబ్రవరి 19న విడుదల కానుంది. సంబంధిత ప్రోమో తాజాగా రిలీజైంది.

తన పాడ్‌కాస్ట్‌కు ‘టేక్‌ 20’ (Take 20) పేరు పెట్టిన సమంత అదెలా ఉండబోతుందో ప్రోమోలో తెలిపారు. ‘‘ఇందులో క్వాలిటీ వెల్‌నెస్‌ కంటెంట్‌ ఉంటుంది. అది మన జీవితానికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో చెప్పే అంశాలన్నీ ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేసినవి. అవి లైఫ్‌ని బెటర్‌ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ సమాచారం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. మాతో జాయిన్‌ అవ్వండి’’ అని పేర్కొన్నారు. అదే వీడియోలో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ను పరిచయం చేశారు. రెండేళ్లుగా తనతో పరిచయం ఉందని చెప్పారు. 

‘యశోద’ తర్వాత సమంత నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలు గతేడాది విడుదలయ్యాయి. వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) విడుదలకు సిద్ధమవుతోంది. కొన్ని రోజుల క్రితమే సమంత తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ హీరో. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని