Sara Ali Khan: శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్.. ఆ సారా నేను కాదు: సారా అలీఖాన్‌

ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్‌ సారా అలీఖాన్‌, అనన్యా పాండే సందడి చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలైంది.

Published : 07 Nov 2023 01:40 IST

ముంబయి: భారత క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)తో డేటింగ్‌పై నటి సారా అలీఖాన్ (Sara Ali Khan) కాఫీ విత్‌ కరణ్ షోలో స్పందించారు. ‘‘శుభ్‌మన్ గిల్‌తో నువ్వు డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి దానిపై మీ అభిప్రాయం ఏమిటి’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ఆ సారా తాను కాదని ఆమె బదులిచ్చారు. ‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్‌ సారా వెనుక పడుతోంది’’ అని ఆమె అన్నారు. సారా అలీఖాన్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శుభ్‌మన్‌తో తాను ప్రేమలో లేనట్టు చెబుతూనే.. సచిన్ కుమార్తె సారా - గిల్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ ఆమె హింట్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదే షోలో పాల్గొన్న అనన్యా పాండే.. ఆదిత్య రాయ్‌ కపూర్‌తో తాను ప్రేమలో ఉన్నానని పరోక్షంగా చెప్పారు.

Rashmika: నాకెంతో బాధగా ఉంది: మార్ఫింగ్‌ వీడియోపై రష్మిక పోస్ట్‌

ఇక, శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీఖాన్‌ విషయానికి వస్తే.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు కూడా గతంలో వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్‌ నటి సారా అలీఖాన్‌తో డేట్‌లో లేడని.. క్రికెటర్‌ సచిన్‌ కుమార్తె సారాను ఆయన ప్రేమిస్తున్నాడని పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో గిల్‌ హాఫ్‌ సెంచరీ చేయగానే గ్యాలరీలో ఉన్న సారా తెందూల్కర్‌ సంబరాలు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని