‘సారంగ దరియా’ రికార్డు!

‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోని సారంగ దరియా గీతం సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన (యూట్యూబ్‌లో) తక్కువ సమయంలోనే  1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది.

Published : 29 Mar 2021 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని సారంగ దరియా గీతం సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన (యూట్యూబ్‌లో) అనతి కాలంలోనే 1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది. ఫిబ్రవరి 28న కథానాయిక సమంత ఈ పాటని విడుదల చేశారు. ఇప్పటి వరకు 90 మిలియన్లకి పైగా వీక్షణలు సొంతం చేసుకుని, శ్రోతల్లో జానపదానికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియజేస్తోంది ఈ గీతం. పాటకు తగినట్టు సాయి పల్లవి చేసిన నృత్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

ఈ గీతానికి సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా పవన్‌ సి.హెచ్‌. స్వరాలు సమకూర్చారు. మంగ్లీ ఆలపించారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోంది ఈ ‘లవ్‌ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకుడు. నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలోని ఇతర పాటలకూ మంచి ఆదరణ లభిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని