Sarkaru vari pata: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. సరికొత్త రికార్డు

పరశురామ్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Published : 13 May 2022 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరశురామ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదలైన ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోంది. అంతేకాదు, కలెక్షన్ల విషయంలోనూ దూసుకుపోతోంది. మొదటిరోజు రూ.75కోట్ల వసూళ్లు సాధించి, ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్‌లు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అమెరికాలో 1మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేసింది. మరో రెండు వారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ వసూళ్లు చేస్తుందని సినీ నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుతం భారీ సినిమాలు లేకపోవడం, వేసవి సెలవులు కావడం బాగా కలిసి వస్తుందంటున్నారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించిన ఈ సినిమాలో సముద్రఖని, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. నవీన్‌ యెర్నేని, వై. రవి శంకర్‌,రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు