Scoop: ఆ క్రైమ్ రిపోర్టర్‌ను హత్య చేసింది ఎవరు? ‘స్కూప్’ ట్రైలర్ చూశారా?
‘ప్రతి ఒక్కరూ జైదీప్ సేన్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, నేను ఒక్కదానే నా కోసం పోరాటం చేస్తున్నా’ అంటున్నారు కరిష్మా తన్నా.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ప్రతి ఒక్కరూ జైదీప్ సేన్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, నేను ఒక్కదాన్నే నా కోసం పోరాటం చేస్తున్నా’ అంటున్నారు కరిష్మా తన్నా. హన్సల్ మెహతా దర్శకత్వంలో ఆమె కీలక పాత్రలో రూపొందిన సరికొత్త వెబ్‌సిరీస్ ‘స్కూప్’ (Scoop). జిగ్నా వోరా రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్‌ది బైకుల్లా: మై డేస్ ఇన్ ప్రిజన్’ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న జాగృతి పాఠక్ (కరిష్మా తన్నా)కు చోటా రాజన్ నుంచి ఫోన్ రావడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరించే సాగింది. ఒక సాధారణ రిపోర్టర్‌గా చేరిన జాగృతి ఏడేళ్లలో మూడు ప్రమోషన్లు పొంది డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా ఎదగడం, అంతలోనే సీనియర్ క్రైమ్ రిపోర్టర్ జైదీప్ సేన్ పట్టపగలే హత్యకు గురవడం, తదితర సన్నివేశాలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. జైదీప్ హత్యకు గురవడానికి జాగృతి పాఠక్ కారణమని ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేస్తారు. మరి ఈ కేసు నుంచి జాగృతి ఎలా బయటపడింది? ఇంతకీ జైదీప్‌ను హత్య చేసింది ఎవరు? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Itel: రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ
-
Nara Bhuvaneswari: ఇప్పటి వరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు: నారా భువనేశ్వరి
-
Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఉంటాడా..? రోహిత్ శర్మ సమాధానమిదే!
-
Google: 25 వసంతాల గూగుల్.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
-
చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!
-
Ganesh Nimajjanam: రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర