ఆ సినిమా బీజీఎం.. ‘శంకర్ దాదా’ సాంగ్!
కొన్ని పాటలు వింటునపుడు అరే! ఇది ఫలానా సినిమాలోని నేపథ్యం సంగీతం కదా అనిపిస్తుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని పాటలు వింటున్నప్పుడు అరే! ఇది ఫలానా సినిమాలోని నేపథ్యం సంగీతం కదా అనిపిస్తుంటుంది. మరి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని టైటిల్ గీతం ‘బేగంపేట బుల్లెమ్మో’ విన్నప్పుడు అలా ఏమైనా అనుకున్నారా? ‘బేగంపేట బుల్లెమ్మో’ సాహిత్యం ఎంతగా హుషారెత్తిస్తుందో అందులోని క్యాచీ ట్యూన్ అంతకన్నా ఎక్కువగా ఉర్రూతలూగిస్తుంది. ఆ బీట్‌కి చిరంజీవి స్టెప్పులు తోడవ్వడంతో సూపర్ హిట్‌గా నిలిచిందా గీతం. ఈ మ్యూజిక్ మరో చిత్రంలోని నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) అంటే నమ్ముతారా? జె.డి. చక్రవర్తి కథానాయకుడిగా తెరకెక్కిన ‘నవ్వుతూ బతకాలిరా’ చిత్రంలో ఈ బీట్ వినిపిస్తుంది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో ఎంట్రీ సమయంలో వినిపిస్తుంది ఈ మ్యూజిక్. ‘అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, యానాం, కడియం, రాజ రాజ రాజమండ్రి’ అంటూ చక్రవర్తి చెప్పే సంభాషణకు సంబంధించిన బీజీఎం ఇది. కథానాయకుడి పాత్రకు తగినట్టుగా బీజీఎం అందించినప్పటికీ అదే ట్యూన్‌తో ఆ చిత్రంలో పాట చేసే అవకాశం రాలేదు. బీట్ బాగుండటంతో కొన్నాళ్ల తర్వాత జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘శంకర్ దాదా’ సినిమాకి తీసుకున్నారు. ఈ రెండింటి వెనక ఉన్న స్వర కర్త ఒకరే. ఆయనెవరో కాదు.. సంగీత సంచలనంగా పిలిచే దేవిశ్రీ ప్రసాద్. డీఎస్పీ ఒక్కరికే కాదు చాలామంది మ్యూజిక్ డైరక్టర్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ కథ కోసం మనసు పెట్టి రూపొందించిన స్వరాన్ని మరో చిత్రంలో పాటగా ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే?
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా