shobha shetty: బిగ్‌బాస్‌ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్‌.. వీళ్లే ఫైనలిస్ట్‌లు..!

bigg boss season 7: ఈ వారం అతి తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.

Updated : 11 Dec 2023 00:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg boss telugu 7) మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి (shobha shetty) ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో ఆమె హౌస్‌ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్‌లో అమర్‌, అర్జున్‌, ప్రియాంక, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, శివాజీలు మిగిలారు. వీరే ఫైనలిస్ట్‌లు అంటూ నాగార్జున ప్రకటించారు. హౌస్‌ లోపలి నుంచి వేదికపైకి వచ్చిన శోభ తన జర్నీ చూసి భావోద్వేగానికి గురైంది. కన్నీటి పర్యంతమైన ఆమెను నాగార్జున ఓదార్చారు. అనంతరం హౌస్‌లో ఉన్న వాళ్లలో గుడ్‌ సైడ్‌, బ్యాడ్‌సైడ్‌ ఏంటో చెప్పాలని అడిగారు. 

  • అర్జున్‌: బ్యాడ్‌సైడ్‌ అంటూ ఏమి లేదు. కాకపోతే, గతవారం ఓటింగ్‌లో లాస్ట్‌లో ఉన్నానని నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడు. దాని నుంచి బయటకు రావాలి.
  • ప్రియాంక: బాగానే ఆడుతుంది. గొడవ పడినా తొందరగా కలిసిపోతుంది. చెప్పేటప్పుడు మన మాట వినదు. అదొక్కటే బ్యాడ్‌.
  • యావర్‌: ఆట విషయంలో అతనికి కాన్ఫిడెన్స్‌ ఉంది. ఎదుటి మనుషులను మాత్రం అర్థం చేసుకోడు.
  • ప్రశాంత్‌: అన్నీ మంచి విషయాలు. పరిస్థితులను బట్టి రియాక్ట్‌ అవుతాడు.
  • శివాజీ: హౌస్‌లో పరిస్థితులు బట్టి కోపాన్ని ఎదుటివారిపై చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఆయన ప్రవర్తించారు. అందరినీ గైడ్‌ చేస్తారు.
  • అమర్‌: ట్రోఫీ తీసుకుని అనంతపురానికి వెళ్లాలి. ఆవేశం వదిలేసెయ్‌. 

అంతకుముందు నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘నా సామిరంగ’ ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వచ్చి సందడి చేశారు. ‘ఈ 14 వారాల జర్నీలో హౌస్‌లో ఉన్న వాళ్ల దగ్గరి నుంచి మీరు నేర్చుకున్న లక్షణం ఏంటి’ అని నాగార్జున అడగ్గా, ఇతరుల నుంచి ఏయే విషయాలను నేర్చుకున్నారో హౌస్‌మేట్స్‌ చెప్పారు.

  • అమర్‌: గేమ్‌ విషయంలో ప్రశాంత్‌ చాలా సూటిగా ఉంటాడు. ఏ పని చేసేటప్పుడైనా అది అవసరం. ఇక అర్జున్‌ అన్న ఆట ఆడేటప్పుడు తప్పు అని తెలిస్తే, పక్కకు వచ్చేస్తాడు. ఆ నిజాయతీ నేర్చుకున్నా. 
  • యావర్‌: ఓపికతో ఎలా ఉండాలో శివాజీని చూసి నేర్చుకున్నా. ప్రతిదాన్ని సాగదీయకూడదని తెలుసుకున్నా. 
  • ప్రియాంక: అమర్‌ ఫౌల్‌ గేమ్స్‌ ఎక్కువ ఆడతాడు. అలా ఆడకూడదన్న విషయం అతడి దగ్గర నేర్చుకున్నా.
  • అర్జున్‌: ఇతరులతో లౌక్యంగా ఎలా ఉండాలో శివాజీ దగ్గరి నుంచి నేర్చుకున్నా. తప్పు జరిగినా సాధించాలనే పట్టుదల యావర్‌ను చూసి నేర్చుకున్నా. గొడవ పడినా కూడా వచ్చి సారీ చెప్పటం ప్రశాంత్‌ను చూసి నేర్చుకున్నా. అందరితోనూ నవ్వుతూ ఎలా మాట్లాడాలో ప్రియాంక చూసి తెలుసుకున్నా. కానీ ఆచరించడం కుదరడం లేదు.
  • శోభ: ఎవరి దగ్గరా ఏమీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి అందరూ మారిపోతుంటారు. ఫోన్‌ లేకుండా బతకగలనని మాత్రం ఇక్కడ నేర్చుకున్నా. బయటకు వెళ్లాక కూడా ఫోన్‌ వాడకాన్ని తగ్గిస్తా.
  • శివాజీ: యావర్‌లో ఒక గొప్ప గుణం ఉంది. తోటివారు భోజనం చేయలేదంటే వారి కోసం దాచిపెట్టి మరీ పెడతాడు. అలాగే తనకు కావాల్సింది అడిగి తీసుకుంటాడు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని చెబుతాడు.
  • ప్రశాంత్‌: ఎదుటి వాళ్లు బాధలో ఉన్నప్పుడు మనం నవ్వితే వాళ్లు కూడా ఆ బాధ నుంచి బయట పడతారని శివాజీ నుంచి నేర్చుకున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని