Shruti haasan: రజనీ చిత్రంలో శ్రుతిహాసన్‌?

కథానాయకుడు రజనీకాంత్‌.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కొత్త చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీన్ని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Updated : 16 Apr 2024 09:24 IST

థానాయకుడు రజనీకాంత్‌.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కొత్త చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీన్ని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యముందని.. ఆమె దీంట్లో రజనీ కుమార్తెగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాన్ని బట్టి.. ఈ సినిమా బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీ పాత్ర మునుపెన్నడూ చూడని సరికొత్త రీతిలో కనిపించనుంది. జూన్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభించనున్నారని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక శ్రుతి ప్రస్తుతం ‘చెన్నై స్టోరీ’, ‘డెకాయిట్‌’, ‘సలార్‌ 2’ చిత్రాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని