siddharth: ప్రేమకథ అంటే భయమేస్తోంది
ఒకప్పుడు ప్రేమకథలకి కేరాఫ్... సిద్ధార్థ్. పక్కింటి కుర్రాడు... లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఆయన వరుసగా ప్రేమకథా చిత్రాల్లో మెరిశారు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’ తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు.
ఒకప్పుడు ప్రేమకథలకి కేరాఫ్... సిద్ధార్థ్ (siddharth). పక్కింటి కుర్రాడు... లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఆయన వరుసగా ప్రేమకథా చిత్రాల్లో మెరిశారు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’ తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. కథానాయకుడిగా ఆయన కెరీర్ మొదలై ఇరవయ్యేళ్లవుతోంది. ఈసారి యాక్షన్ హీరోగా ‘టక్కర్’తో సందడి చేయనున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ విలేకర్లతో చెప్పిన విషయాలివీ...
యాక్షన్ కథలపై దృష్టి పెట్టారు. ప్రేమకథలతో విసిగిపోయారా?
అదే గులాబీ పువ్వు చేతపట్టుకుని... అమ్మాయితోనూ, వాళ్ల నాన్నతోనూ అవే సంభాషణలు చెప్పి ఒక దశలో అలసిపోయా. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలతో పోలుస్తూ వాటిని మించిపోయేలా మరొకటి తీద్దాం అంటూ ప్రేమకథలతో వస్తుంటారు. చివరికి ప్రేమకథల మారథాన్‌లా మారింది నా ప్రయాణం. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రేమకథ చేద్దాం అని వస్తే భయమేస్తుంది. ఒకవేళ అది సూపర్‌హిట్ అయ్యిందంటే మరో పదేళ్ల వరకూ అలాంటి ప్రేమకథలతోనే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అని! ప్రేమకథలు చేసే కుర్రాడు అలాంటివే చేయాలనే ఓ నియమం మన దగ్గర ఉంది. నాకేమో ఎప్పటికప్పుడు కొత్త రకమైన కథలతో ప్రయాణం చేయాలని ఉంటుంది.
అసలు ‘టక్కర్’ కథేమిటి? ఎలా ఉంటుంది?
ఇద్దరి మధ్య ఘర్షణ అనే అర్థం వచ్చేలా పెట్టిన పేరు ఇది. హీరో విలన్ల మధ్య ప్రతి సినిమాలోనూ ఘర్షణ ఉంటుంది. ఇందులోనూ ఉంది. కానీ హీరో హీరోయిన్ మధ్యలో ఘర్షణే ఈ సినిమాలో నాకు చిత్రంగా అనిపించింది. శారీరక పరమైన ఘర్షణే కాకుండా... భావోద్వేగాల పరంగానూ కొన్ని గొడవలు జరుగుతాయి. అవెలాంటివనేది తెరపైనే చూడాలి. మగ - ఆడ, డబ్బున్నోడు - లేనోడు, వయసు, డబ్బు తారతమ్యాలు ఇలా పలు కోణాల్ని ఆవిష్కరించే కథ ఇది. డబ్బు సంపాదించాలని ఊరి నుంచి వచ్చిన ఓ కుర్రాడి చుట్టూ సాగుతుంది. కార్తీక్.జి క్రిష్ పక్కా కమర్షియల్ అంశాలతో నేటితరానికి తగ్గట్టుగా సినిమాని తీశాడు.
మరి ‘టక్కర్’ మిమ్మల్ని యాక్షన్ హీరోగా నిలబెడుతుందా?
నేనొక యాక్షన్ హీరోని అనిపించుకోవాలని చేసిన సినిమా కాదిది. స్వతహాగా నేను సున్నిత మనస్కుడిని. హింసాత్మక సినిమాల్ని ఎంతమాత్రం ఇష్టపడను. తొలిసారి నేను చేస్తున్న ఓ కథలో యాక్షన్ ఉంది. అందుకే ఈ సినిమాలో యాక్షన్ చేశా. హీరో కాబట్టి కొట్టడం కాకుండా.. పాత్రకి అవసరం ఉంటుంది కాబట్టే కొడతాడు.
తెలుగులో సినిమాలు తక్కువగా చేస్తున్నారెందుకని?
నీకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కదా, అక్కడ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని బయట పరిశ్రమల్లో నటిస్తున్నప్పుడు ఇలాగే చాలా మంది అడుగుతుంటారు. మంచి సినిమా వచ్చినప్పుడు నేనెప్పుడూ నో చెప్పలేదు. దీన్నిబట్టి మంచి సినిమా నా దగ్గరికి రావడం లేదు, మంచి సినిమా తీస్తున్నవాళ్లు నన్ను దృష్టిలో పెట్టుకోవడం లేదనే కదా అర్థం. అదెందుకనేది వాళ్లే చెప్పాలి? నాకూ, తెలుగు ప్రేక్షకులకీ మధ్యనున్న బంధం మాత్రం అలాగే ఉంది. మా ఇద్దరి మధ్య పుల్‌స్టాప్ కాదు, కామా కూడా లేదు. నువ్వు యాక్షన్ చేస్తే చూస్తారా? అన్నవాళ్లు కొందరైతే, నువ్వు పక్కింటి అబ్బాయిలానే ఉండిపో అన్నవాళ్లు కొందరు. ఇలా కాదని... ఒక కథకి నాయకుడిగానూ, నిర్మాతగానూ నిలబడదాం అని ఓ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించా. ఆ ప్రయత్నం మొదట ఇక్కడే చేశా. కానీ నాకు సరైన సహకారం లభించలేదు. తమిళంలో నిరూపించుకుని మళ్లీ ఇప్పుడు నా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా.
ఈ సినిమా వేడుకలో ‘బొమ్మరిల్లు 2’ ప్రస్తావన వచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం?
‘బొమ్మరిల్లు’ సినిమాకి ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపు అంటే నేనూ, భాస్కర్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సినిమాని అధిగమించేలా మరో చిత్రం చేయడం ఓ పెద్ద సవాల్.
తదుపరి మీరు చేయనున్న సినిమాల కబుర్లు?
నా సొంత నిర్మాణ సంస్థలోనే ‘చిన్నా’ అనే సినిమా చేస్తున్నా. నా జీవితంలోకి వస్తున్న మరో అత్యుత్తమమైన చిత్రం అది. అవార్డులు, రివార్డులు... ఆ సినిమాతో అన్నీ వస్తాయనే నమ్మకం ఉంది. కొన్ని సినిమాలకి ఇలా రాసి ఉంటుంది. అలాగే కార్తీక్ క్రిష్‌తోనే మరో సినిమా కూడా చేస్తా. ‘ఇండియన్2’తోపాటు, మాధవన్, నయనతారలతో కలిసి ‘టెస్ట్’ అనే సినిమా చేస్తున్నా. వరుసగా ఐదు సినిమాలు వస్తాయి.
‘‘ నాదైన జీవితాన్ని నేను గడిపినప్పుడే... నటుడిగా ప్రభావం చూపించగలననేది నా అభిప్రాయం. అందుకే వ్యక్తిగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే స్వేచ్ఛగా వెళతా. వందల కోట్లు, రికార్డులు... ఇవేవీ నాకు అవసరం లేదు. పొద్దున లేచామా? ఇష్టమైన సినిమా కోసం పనిచేశామా? అనేదే ఆలోచిస్తా. ఇష్టమైన సినిమా చేసే స్వేచ్ఛ ఉంటే చాలు, ఇంకేమీ నాకు ఇంకేమీ అవసరం లేదు. రచన అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ రాస్తూనే ఉంటా. ‘గృహం’ సినిమాకి కొనసాగింపుగా స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం