Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్‌

యువ గాయని హారికా నారాయణ్‌ పెళ్లి వేడుకగా జరిగింది.

Published : 18 Mar 2024 14:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ గాయని హారికా నారాయణ్‌ (Harika Narayan) వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు పృథ్వీనాథ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకలో సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, కోటితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువే హారికా నారాయణ్‌. మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని కలలు కన్న ఆమె అనుకోనివిధంగా సింగర్‌ అయ్యారు. తన గానంతో యువతను ఉర్రుతలూగించారు. ‘ఆచార్య’లోని ‘లాహే లాహే’, ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ ట్రాక్‌ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. నిశ్చితార్థం అనంతరం పృథ్వీనాథ్‌ను పరిచయం చేస్తూ ఇటీవల ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘అందమైన స్నేహం.. ప్రేమ.. ఏడేళ్ల ప్రయాణమిది. నీతో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆమె రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని