Ram Pothineni: ‘స్కంద’ మాస్‌ చిత్రం మాత్రమే కాదు..: రామ్‌

రామ్‌ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’. ఈ సినిమా వేడుకను కరీంనగర్‌లో నిర్వహించారు.

Published : 25 Sep 2023 22:47 IST

కరీంనగర్‌: ‘స్కంద’ (Skanda) కేవలం మాస్‌ చిత్రమే కాదని ఎమోషన్స్‌ ఉన్నాయని నటుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) అన్నారు. కరీంనగర్‌లో సోమవారం నిర్వహించిన ఆ సినిమా ‘కల్ట్‌ జాతర’ (Skanda Cult Jathara) ఈవెంట్‌లో మాట్లాడారు. ఆయన హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. శ్రీలీల (Sree Leela) కథానాయిక. శ్రీకాంత్‌, సయీ మంజ్రేకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వేడుక నిర్వహించి ‘రిలీజ్‌’ ట్రైలర్‌ విడుదల చేశారు.

ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

వేడుకనుద్దేశించి రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇప్పటికే పూర్తయింది. రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేసేందుకు ఇక్కడ ఈవెంట్‌ నిర్వహించాం. బోయపాటి శ్రీను అనగానే అందరూ ఫైట్స్‌ అంటుంటారు. బోయపాటి అంటే ఫైట్స్‌ మాత్రమే కాదు ఎమోషన్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఈ చిత్రంలో ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. బోయపాటి గత చిత్రాల్లానే ఇందులోనూ సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది’’ అని తెలిపారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘కవులు, కళాకారులు పుట్టిన, గోదావరి పారే ఈ గడ్డపై వేడుక నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సినిమాని తెరకెక్కించే సమయంలోనే టెన్షన్‌ పడతా. ఔట్‌పుట్‌ వచ్చిన తర్వాత టెన్షన్‌ పెడను ఎందుకంటే నేను చాలా బాగా తీశానని నాకు తెలుసు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్‌, సయీ మంజ్రేకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని