Prabhas Statue: ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

ప్రభాస్‌ కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు.

Published : 26 Sep 2023 02:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. ఇక ఇందులో ప్రభాస్‌ నటించిన అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఆ పాత్రలో ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ప్రముఖ మేడమ్‌ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు.

అయితే, తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా బొమ్మను తయారు చేసి పెట్టారు.  విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు