Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
‘భీమ్లానాయక్’తో తెలుగువారికి పరిచయమైన మలయాళీ భామ సంయుక్త (Samyuktha). ఇటీవల ‘సార్’తో అలరించిన ఆమె తాజాగా ‘విరూపాక్ష’ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: ‘విరూపాక్ష’ (Virupaksha) టీమ్‌పై నటి సంయుక్త (Samyuktha) ఆగ్రహం వ్యక్తం చేసింది. మాటిచ్చారు సరే.. నెరవేర్చలేదెందుకు అని ప్రశ్నించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీని ట్యాగ్ చేస్తూ తన నిరాశను బయటపెట్టింది. ‘‘విరూపాక్ష’తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అద్భుతమైన నటీనటులు, టెక్నీషియన్స్‌తో పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అయితే, ఎస్‌వీసీసీ.. ఎందుకంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. విరూపాక్షలో నా పాత్రను పరిచయం చేస్తూ ఉగాది రోజున ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. మరి అదెక్కడ?’’ అని ఆమె ప్రశ్నించింది.
దీనిపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. సరైన సమయం చూసి త్వరలోనే పోస్టర్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. నిర్మాణ సంస్థ స్పందనతో కాస్త శాంతించిన ఆమె.. ‘‘సరే.. నేను ఎదురుచూస్తుంటా’’ అని బదులిచ్చింది. సంయుక్త ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. సంయుక్త నిజంగానే ఆగ్రహంగా ఉన్నారా? లేదా ఇదంతా కేవలం ప్రమోషన్ కోసమేనా? అని మాట్లాడుకుంటున్నారు.
‘సార్’ (SIR) తర్వాత సంయుక్త నటిస్తున్న చిత్రమిది. సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కథానాయకుడిగా కార్తిక్ దండు దీన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. మూఢ నమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. వేసవి కానుకగా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్