Tollywood: నక్షత్ర ‘సొగసు చూడ తరమా’

నూతన నటీనటులు తల్లాడ సాయి కృష్ణ, నక్షత్ర జంటగా నటిస్తున్న యువ ప్రేమకథ చిత్రం ‘సొగసు చూడ తరమా’. తల్లాడ సాయి కృష్ణ దర్శకుడు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్,....

Published : 14 Jul 2021 09:04 IST

హైదరాబాద్‌: నూతన నటీనటులు తల్లాడ సాయి కృష్ణ, నక్షత్ర జంటగా నటిస్తున్న యువ ప్రేమకథ చిత్రం ‘సొగసు చూడ తరమా’. తల్లాడ సాయి కృష్ణ దర్శకుడు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హీరోయిన్‌ నక్షత్ర పుట్టినరోజు పురస్కరించుకుని మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌ గ్లిమ్స్‌ని చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నక్షత్ర మాట్లాడుతూ.. ‘ నేను నటించిన రెండవ సినిమా ఇది. అరకులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ‘సొగసు చూడ తరమా’లో నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ రోజు రిలీజైన గ్లిమ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాను’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని