Updated : 13 May 2022 21:56 IST

Sonal: దేశమంతా టాలీవుడ్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటోంది: సోనాల్ చౌహాన్‌

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌3’. తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలు. బాలీవుడ్‌ నటి సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక సోనాల్ చెప్పిన ముచ్చట్లు..  

‘ఎఫ్3’లో ఆఫర్‌ ఎలా వచ్చింది?

సోనాల్: అనిల్‌ రావిపూడి నాకు ‘లెజెండ్‌’ సినిమా అప్పుడు పరిచయం. ఆ సినిమా షూటింగ్‌ అప్పుడే మాట్లాడుకున్నాం. ఒకరోజు ఆయన ఫోన్‌ చేసి ‘ఎఫ్‌3’లో ఒక పాత్ర ఉంది. మీరైతే బాగుంటుంది అన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. ‘ఎఫ్‌2’ని మించిన నవ్వులు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది.

‘ఎఫ్‌3’ ట్రైలర్‌లో మీరు కనిపించలేదు. ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?

సోనాల్: అది చాలా సీక్రెట్‌. చాలా కీలక పాత్ర. అందుకే ట్రైలర్‌లో కనిపించలేదు. నా పాత్రతో సినిమా మలుపు తిరుగుతుంది. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ మూవీలో నటించడం ఇదే తొలిసారి. చాలా ఛాలెంజ్‌గా అనిపించింది. కామెడీ చేయడం అంత సులభం కాదని అర్థమైంది. మొదట చాలా కంగారు పడ్డా. ‘నా పాత్ర కోసం ఏమైనా సినిమాలు చూడమంటారా’ అని దర్శకుడిని అడిగా. ఆయన చాలా కూల్‌గా ‘షూటింగ్‌కి వచ్చేయండి’ అని చెప్పారు. ఆయనకు పని పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. అందుకే ఆర్టిస్టులకు ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది. 

వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది ?

సోనాల్: వెంకటేష్‌ గొప్ప నటుడు, సెట్‌లో అందరితో కలిసిపోతారు. చాలా సహాయం చేస్తారు. సమయం వృథా చేయరు. నేను ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇక వరుణ్‌ చాలా పాజిటివ్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. తనతో వర్క్‌ చేయడం చాలా సరదాగా ఉంటుంది. అలాగే, తమన్నా, మెహ్రీన్‌లతో కలసి పని చేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. మేము మంచి స్నేహితులమయ్యాం.

మీరు చాలా భాషల్లో నటిస్తున్నారు కదా.. టాలీవుడ్‌లో ప్రత్యేకత ఏమైనా గమనించారా?

సోనాల్: ఇక్కడ దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అది అందించాలని చాలా తపన పడతారు. అందుకే మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు దేశమంతా టాలీవుడ్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటోంది.

కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నారు ?

సోనాల్: ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్‌’ సినిమా చేస్తున్నాను. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని