kalki: స్పెషల్‌ డే.. సందడిగా కొత్త సినిమాల అప్‌డేట్స్‌

శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు విడుదలవుతున్నాయి.

Published : 08 Mar 2024 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ వచ్చిందంటే సినీ ప్రియులు.. అభిమాన తారల సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక ఈరోజు మహాశివరాత్రి, మహిళా దినోత్సవం కలిసి వచ్చేసరికి సినిమా అప్‌డేట్‌లతో సోషల్‌ మీడియా సందడిగా మారింది. ఒకవైపు కొత్త చిత్రాలతో థియేటర్లు కళకళలాడుతుండగా.. మరోవైపు కొత్త పోస్టర్లు ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి. తమన్నా ‘ఓదెల2’ ఫస్ట్‌ లుక్‌తో చిత్రబృందం శివరాత్రి శుభాకాంక్షలు చెప్పగా.. అంజలి పోస్టర్‌తో ‘గ్యాంగ్‌ ఆఫ్ గోదావరి’ టీమ్‌ విషెస్‌ను షేర్‌ చేసింది. అలాగే, బాలకృష్ణ 109వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆ టీమ్‌ పంచుకుంది. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు