‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’.. బర్త్‌డే టీజర్‌ అదుర్స్‌!

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. తన రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కల్యాణ మండపం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Published : 14 Jul 2021 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. తన రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కల్యాణ మండపం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, జులై 15 కిరణ్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని ‘బర్త్‌డే టీజర్‌’ పేరుతో ‘ఎస్.ఆర్‌. కల్యాణమండపం’లోని ఓ సన్నివేశాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్పించలేదా మీ నాన్న నీకు’ అనే డైలాగ్‌కి ‘గడ్డాలు నెరిసిపోతున్నా బుద్ధి రానోళ్లతో ఇంకెలా మాట్లాడాలి’ అంటూ కిరణ్‌ ఇచ్చిన కౌంటర్‌ అదుర్స్‌ అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకి ఈ బర్త్‌డే టీజర్‌ తోడై ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కిరణ్‌ సరసన ప్రియాంక జవాల్కర్‌ నటించింది. సాయికుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించారు. ప్రమోద్‌, రాజు నిర్మించిన ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం కిరణ్ చేతిలో ‘సెబాస్టియన్‌’, ‘సమ్మతమే’ ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు మరో సినిమానీ ఖరారు చేశాడు. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని