Tollywood: వినోదం వెనుక దాగున్న వారి కష్టాలెన్నో..!
ఒక సినిమా కోసం నటీనటులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటారు. అలా, ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన సమస్యలపై నటీనటులు చెప్పిన విశేషాలివే..!
ఇంటర్నెట్‌డెస్క్: సినిమా (Cinema).. కోట్ల మంది ప్రజలకు వినోదాన్ని అందించే మాధ్యమం. కేవలం రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను అలరించడం కోసం 24 విభాగాల వారు ఎన్నో రోజులపాటు శ్రమించి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తారు. తెర వెనుక ఉండేవారి శ్రమ ఒకటి అయితే.. తెరపై కనిపించే నటీనటులు ఎదుర్కొనే సవాళ్లు అనేకం. ఒక పాత్రను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లడం కోసం కఠినమైన డైట్ చేయడం, పాత్ర డిమాండ్ చేస్తే కొన్నిసార్లు తప్పక మద్యం తీసుకోవడం.. ఇలా ఎన్నో ఇబ్బందులను వాళ్లు చవి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక సినిమా కోసం తాము ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఇటీవల కాలంలో నటీనటులు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేద్దాం.
వర్కౌట్స్ మానేశా : సమంత
టాలీవుడ్ హీరోయిన్స్‌లో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ సమంత (Samantha). ఆమె డే టు డే లైఫ్‌లో జిమ్ కచ్చితంగా ఉంటుంది. అలాంటి సామ్ ‘శాకుంతలం’ (Shaakuntalam) కోసం తన వర్కౌట్ స్టైల్స్‌ను మార్చుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఫ్యామిలీ మ్యాన్’ పూర్తి చేసిన సమయంలోనే నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ పాత్ర నేను చేయలేననిపించింది. సున్నితంగా తిరస్కరించాను. కానీ, గుణశేఖర్ నన్ను ఒప్పించారు. సినిమా విషయంలో నాకెంతో సపోర్ట్ చేశారు. లుక్ టెస్ట్‌కు వెళ్లినప్పుడు కాస్ట్యూమ్స్‌లో నన్ను నేను చూసుకుని పాత్ర కోసం ఎంతగానో మారాలని అర్థమైంది. ఎందుకంటే అప్పుడే రాజీ (ఫ్యామిలీ మ్యాన్) చేసి ఉన్నాను. నా లుక్స్ రఫ్‌గా ఉన్నాయి. దాంతో వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కౌట్స్ మానేశాను. వర్కౌట్ స్టైల్ మార్చుకున్నాను. డైట్ మార్చుకున్నా’’ అని సామ్ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్, వాకింగ్ స్టైల్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు.
మద్యం తీసుకున్నా : నాని
నాని (Nani) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘దసరా’ (Dasara). ప్రేమ, పగ, స్నేహం నేపథ్యంలో ఊరమాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. సింగరేణి బొగ్గుగనుల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ కోసం నాని పలు సవాళ్లు ఎదుర్కొన్నారు. మరీ, ముఖ్యంగా తన ఆరోగ్యాన్నే పణ్ణంగా పెట్టినట్లు ఆయన చెప్పారు. విపరీతమైన దుమ్ములో వర్క్ చేయడం వల్ల రాత్రుళ్లు నిద్రపట్టేది కాదన్నారు. అలాగే.. సీన్స్ డిమాండ్ చేయడంతో కొన్నిసార్లు మద్యం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. డిక్షన్ విషయంలోనూ ఆయన పలు జాగ్రత్తలు తీసుకున్నారట.
భాష విషయంలో కష్టపడ్డా : కీర్తి సురేశ్
‘దసరా’ (Dasara)లో కీలకపాత్ర కీర్తి సురేశ్ (Keerthy Suresh). వెన్నెలగా గ్రామీణ యువతి పాత్రలో డీ గ్లామర్ రోల్‌లో కనిపించారు ఈ ముద్దుగుమ్మ. అయితే, ఈ సినిమా కోసం సుమారు 12 కిలోల బరువు పెరగమని చెప్పారట దర్శకుడు శ్రీకాంత్. ఆయన మాట కాదనలేక ఓకే అని చెప్పిన ఆమె.. అంత పెరగలేదు కానీ, కొంతవరకూ బరువు పెరిగారు. అలాగే, ఇందులో తెలంగాణ యాసలో అలరించారు కీర్తి. అయితే, డైలాగ్స్ సరిగ్గా పలకడం.. డిక్షన్ మిస్ కాకుండా ఉండేందుకు తాను కష్టపడినట్లు ఆమె చెప్పారు.
బీస్ట్ లుక్‌లోకి అయ్యగారు..!
లవర్ బాయ్ లుక్‌లో టాలీవుడ్ ప్రేక్షకుల మది దోచారు నటుడు అఖిల్ (Akil). ‘అఖిల్’తో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో సక్సెస్ అందుకున్నారు. దీంతో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఏజెంట్’పై ఫుల్ ఫోకస్ పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన బీస్ట్ లుక్‌లో అలరించనున్నారు. ఈ లుక్ కోసం అఖిల్ జిమ్‌లో కఠోర సాధన చేశారు. ఆరు పలకల దేహం సాధించడం కోసం ఆహార నియమాలు మార్చుకున్నారు.
వీళ్లు మాత్రమే కాదు ప్రభాస్, అనుష్క, రానా, రామ్‌చరణ్.. ఇలా సినిమాల్లో వర్క్ చేస్తే నటీనటులందరూ ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కొందరు లుక్స్.. మరి కొంతమంది భాష.. ఇంకొంత మంది క్లైమెట్.. ఇలా చిత్రీకరణలో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా ఈ సోషల్‌మీడియా యుగంలో ట్రోల్స్, నెగెటివిటీనీ వాళ్లు భరిస్తున్నారు. ఇలా, ఎన్ని సమస్యలు వచ్చినా.. ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)