The Vaccine War: ఈ సినిమా హృదయాన్ని హత్తుకుంటుంది.. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’పై సుధా మూర్తి రివ్యూ..

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War). ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 19 Sep 2023 16:34 IST

ముంబయి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ఆయన తాజా సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War). సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) సతీమణి, రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) ఈ కూడా ఈ సినిమాను వీక్షించారు. మహిళా సైంటిస్ట్‌ల జీవితాలకు సంబంధించిన ఈ సినిమాలో మంచి మెసేజ్‌ ఉందని ఆమె చెప్పారు. విజయవంతమైన ప్రతి స్త్రీ వెనుక ఆమెను సపోర్ట్‌ చేసే ఓ పురుషుడు తప్పకుండా ఉంటాడని సుధామూర్తి అన్నారు.

‘‘తల్లిగా, భార్యగా ఓ మహిళ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగం చేయడం ఎంతో కష్టమైనపని. కానీ, కొందరు ఆడవాళ్లకు కుటుంబం నుంచి ఎంతో సపోర్ట్‌ ఉంటుంది. ఆ విషయంలో వాళ్లు ఎంతో అదృష్టవంతులు. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్‌ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు.. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది’’. 

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..!

‘‘మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు. ఇదే ఈ సినిమా సారాంశం. వైద్యరంగంలోనే కాదు.. ఎందులోనైనా మనం చేయగలమనే నమ్మకం మనకు ఉండాలి. నిజమైన అందమనేది మనం వేసుకునే దుస్తులు, మన మేకప్‌లో ఉండదు.. మన ధైర్యం, విశ్వాసంలో ఉంటుంది. మనపై మనకున్న విశ్వాసమే సంపద అని ‘ది వ్యాక్సిన్ వార్‌’లో చాలా బాగా చూపించారు. దేశంలోని వారంతా వారి సామర్థ్యాలను బయటకు తీయాలి. భారతీయులైనందుకు గర్వపడాలి’’ అని సుధామూర్తి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు