ప్రముఖ నటుడి కుమార్తెకు బాడీ షేమింగ్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌

సినీ సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులు తరచూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా మలయాళీ నటుడి కుమార్తె శరీరాకృతి విషయంలో నెగెటివ్‌ కామెంట్స్‌ ఎదుర్కొన్నారు.

Updated : 07 Jun 2023 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళీ నటుడు సురేశ్‌ గోపీ (Suresh Gopi) కుమార్తె భాగ్య తాజాగా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలపై.. లావుగా ఉన్నవాళ్లకు చీరలు సెట్‌ కావంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పని మీరు చూసుకోండి అంటూ బదులిచ్చారు.

కెనడాలోని ఓ కాలేజీ నుంచి భాగ్య ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. వీటిని చూసిన నెటిజన్‌.. ‘‘కంగ్రాట్స్‌.. మీరు ఇకపై చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్‌ దుస్తులు వేసుకుంటే బాగుంటుంది. సమస్య ఏమిటంటే.. లావుగా ఉన్న వాళ్లకు చీరలు అంతగా సెట్‌ కావు. వెస్ట్రన్‌ దుస్తుల్లో మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు’’ అని రాసుకొచ్చాడు.

నెటిజన్ కామెంట్‌తో అసహనానికి గురైన ఆమె.. ‘‘మీరిచ్చిన ఉచిత సలహాలకు ధన్యవాదాలు. నా బరువు మీకు సంబంధించిన విషయం కాదు. అలాంటప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటా. కేరళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందినప్పుడు ఆ దుస్తులు ధరించాను. వేరే భారతీయ విద్యార్థుల మాదిరిగా పాశ్చాత్య సంస్కృతికి బలవంతంగా తలవంచే వ్యక్తిని నేను కాదు. వేరేవాళ్ల దుస్తులు, శరీరాకృతి గురించి కామెంట్‌ చేయడం మానేసి మీ పనిపై మీరు దృష్టి పెట్టొచ్చుకదా’’ అని ఆమె బదులిచ్చారు.

మలయాళీ పరిశ్రమకు చెందిన సురేశ్‌ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్‌ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులో డబ్బింగ్‌ అయ్యాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు