Suriya: గాయంపై స్పందించిన సూర్య.. కోలుకుంటున్నానంటూ పోస్ట్‌

నటుడు సూర్య (Suriya) తాజాగా గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై అభిమానుల్లో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 24 Nov 2023 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కంగువా’ (Kanguva) షూటింగ్‌లో నటుడు సూర్య (Suriya) గాయపడిన విషయం తెలిసిందే. చిత్రీకరణ సమయంలో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయన భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తాజాగా తనకు అయిన గాయంపై సూర్య స్పందించారు. తాను కోలుకుంటున్నట్లు చెప్పారు. ‘నాకు గాయమైందని తెలిసి ఎంతో మంది మెసేజ్‌లు పంపుతున్నారు. మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..

శివ దర్శకత్వంలో సూర్య ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువా’ (Kanguva). పీరియాడికల్‌ డ్రామాగా దీనిని చిత్రీకరిస్తున్నారు. దీని రిలీజ్‌కు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏకంగా 38 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని